Brother anilkumar
-
కుమార్తె ను చూడడానికి వెళ్తుంటే అడ్డుకుంటారా : వైఎస్ విజయమ్మ
-
నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది : బ్రదర్ అనిల్ కుమార్
-
బ్రదర్ అనిల్‌కుమార్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు 4 వారాల పాటు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఖమ్మం జిల్లా పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. 2009 సాధారణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో స్థానిక పాస్టర్లతో సమావేశం నిర్వహించి కాంగ్రెస్‌కే ఓటు వేయాలంటూ కోరారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమంటూ రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో అనిల్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఖమ్మం, రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన కోర్టు, ఈ నెల 26న అనిల్‌కుమార్ హాజరవాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించా రు. ఖమ్మం జిల్లా పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని, కేసు తదుపరి విచారణను నిలిపివేయాలని కోర్టును అభ్యర్థించారు. -
బ్రదర్ అనీల్ కుమార్ సత్యవ్యాకోపదేశం 2nd Nov 2014
-
బ్రదర్ అనిల్‌పై మరోసారి బీజేపీ ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్‌కుమార్‌పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆగస్టా-వెస్ట్‌లాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణంలో అనిల్‌కుమార్ పాత్ర ఉందంటూ ఆది వారమిక్కడ ఆయన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన త ర్వాతే కేంద్ర ప్రభుత్వం ఇటలీకి చెందిన ఆగస్టా కంపెనీతో 12 హెలికాఫ్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఇటలీకి చెందిన హాస్కీ అనే దళారిని ఇటీవల స్విట్జర్లాండ్‌లో ఇటలీ పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన్ను బ్రదర్ అని ల్ను ఒకేచోట కూర్చోబెట్టి విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. బ్రదర్ అనిల్‌తో సత్సంబంధాలు ఉన్నందునే హస్కీ ఎంఆర్ఎంజీఎఫ్లో డెరైక్టర్‌గా నియమితులయ్యారని ప్రభాకర్ ఆరోపించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన ఒక హెలికాఫ్టర్ కోసం నాటి ప్రభుత్వ సీఎస్ రమాకాంత్‌రెడ్డి నాలుగు సార్లు ఇటలీ వెళ్లివచ్చారని, ఇదెక్కడైనా జరుగుతుందా అని ప్రశ్నించారు. మరో ఉన్నతాధికారి బ్ర హ్మానందరెడ్డి కూ డా ఇటలీ వెళ్లారని, ఈ విషయాన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తే దీని వెనకున్న కాంగ్రెస్ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తాయని చెప్పారు. ఈ కుంభకోణంలో దిగ్విజయ్‌సింగ్, అహ్మద్పటేల్ల పాత్ర ఉందని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రక్షణ మంత్రి ఆంటోనీ ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. -
ఏసుపై విశ్వాసముంటే పాపాల నుంచి రక్షణ
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : ‘ఏసునందు విశ్వాసం ఉంచిన వారు పాపాల నుంచి రక్షించబడతార’ని అంతర్జాతీయ సువార్తీకులు బ్రదర్ అనిల్‌కుమార్ దైవ సందేశాన్నిచ్చారు. అమలాపురం మన్నా సిల్వర్ జూబ్లీ చర్చి 47వ వార్షిక ఏసుక్రీస్తు మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఆయన క్రైస్తవ సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు. మన్నా మినిస్ట్రీస్ అధినేత కార్ల్‌డేవిడ్ కొమనాపల్లి (లాల్), షారోన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు కోనసీమలోని క్రైస్తవమతవిశ్వాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండు గంటలసేపు బ్రదర్ అనిల్ ఉపదేశాన్ని మంత్రముగ్ధులై ఆలకించారు. ‘క్రీస్తు పాపుల కొరకై చనిపోయారు.. నా కొరకు, నీ కొరకు మాత్రమే ఆయన ప్రాణాలర్పించారు. లోకరక్షకునిగా ఆయన ఎప్పుడూ జీవాత్మలో జీవించి ఉంటారు‘ అని బ్రదర్ అనిల్‌కుమార్ అన్నారు. ధర్మశాస్త్రంలో మరణకారణమగు పరిచర్య రాళ్లపై చెక్కి ఉంటుందన్నారు. అయితే ఈ అక్షరాలు ఆత్మసంబంధమైన పరిచర్య ముందు ఎంతో పవిత్రమైనవన్నారు. ప్రభువు మొత్తం లోకరక్షకునిగానే కాకుండా ప్రతీ మనిషి రక్షణ బాధ్యతలను భుజాన వేసుకుంటారన్నారు. ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన దేవుడు ఏసు ప్రభువు ఒక్కడేనని, ఈ ఏసు నందు ప్రతీ ఒక్కరూ రక్షించబడతారన్నారు. సువార్త అంటే మంచి శుభకరమైన వార్త అని, ఏసుక్రీస్తు పాపుల కోసం ఏమి చేశారో అదే మంచి సువార్త అని బ్రదర్ అనిల్ చెప్పారు. సర్వశక్తువంతుడైన ఏసును నమ్మిన ప్రతీ ఒక్కరూ పరిశుద్ధాత్మను పొంద గలరన్నారు. బ్రదర్ అనిల్ ఆంగ్లోపన్యాసాన్ని సువార్త రాజు తెలుగులోకి అనువదించారు. భీమవరం మన్నా చర్చి పాస్టర్ రెవరెండ్ ఎం. దేవదాస్ కూడా ప్రసంగించారు. మన్నా మినిస్ట్రీస్ అధినేత కార్ల్ డేవిడ్ కొమానపల్లి మాట్లాడుతూ ఏసుక్రీస్తు పాపులను రక్షించే దైవదూత అన్నారు. మహోత్సవాల్లో గాయనీగాయకులు ప్రత్యేక గీతాలు ఆలపించారు. బ్రదర్ అనిల్ రోగుల స్వస్థత కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నేడు బ్రదర్ అనిల్ ప్రసంగాలు మన్నా సిల్వర్ జూబ్లీ చర్చిలో ఆదివారం కూడా అంతర్జాతీయ సువార్తీకులు బ్రదర్ అనిల్‌కుమార్ ప్రసంగాలు ఉంటాయని కార్ల్ డేవిడ్ కొమానపల్లి తెలిపారు. కోనసీమ వ్యాప్తంగా క్రైస్తవులు రెండవ రోజు కూడా ఆయన దైవసందేశాన్ని విని ఆత్మ పరిశుద్ధం చేసుకోవాలని కోరారు. ఈనెల 11న ప్రారంభమైన ఈ మహోత్సవాలు ఆదివారంతో ముగుస్తాయన్నారు. నేడు క్రైస్తవులచే మానవహారం అమలాపురం మన్నా జూబ్లి చర్చి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక నల్లవంతెన వద్ద చర్చి సభ్యులందరూ ఆదివారం మధ్యాహ్నం 12.30గంటలకు మానవహారంగా ఏర్పడి సంఘీభావం తెలియజేస్తున్నట్టు చర్చి అధినేత కార్ల్ డేవిడ్ కొమానపల్లి తెలిపారు.