
సాక్షి, హైదరాబాద్ : సీపీఐకి చిత్తశుద్ధి ఉంటే హుజూర్‌నగర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఉపసంహరించుకొని ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ నోరు విప్పాలని, వారు నోరు విప్పితేనే టీఆర్‌ఎస్ ఓనర్లు అవుతారని మండిపడ్డారు. అదే విధంగా రాష్ట్రానికి కేంద్రం కావాల్సిన యూరియాను సరఫరా చేసిందని, స్పీకర్ పోచారం, ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సొంత జిల్లాల్లో యారియా కొరతను సృష్టించారని ఆరోపించారు. యూరియా కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పరిపాలన స్తంభించిదని, ఈఎస్‌ఐ స్కాం, విస్తరిస్తున్న వ్యాధులపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభాకర్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment