ఉప్పల్: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి (ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్) పనులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. నిర్మాణ పనులు పనులు 28 నుంచి పునఃప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు.
ఉప్పల్ స్కై ఓవర్ నిర్మాణ పనులలో జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్లే జాప్యం జరుగుతుండటాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తాను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. యుద్ధ ప్రాతిపదిక ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలని కోరామన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి జులై 24న అవసరమైన నిధుల విడుదలకు అనుమతి మంజూరు చేశానారన్నారు. ఈ నెల 28 నుంచి పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి అదేశించారని ప్రభాకర్ వెల్లడించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్ వెంటనే తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ద్వారా రోడ్డుకు ఇరువైపులా బీటీ రోడ్డు వేస్తామని ప్రకటన చేయించారని ఎద్దేవాచేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని రోడ్డు వేయిస్తుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా ఎన్‌వీఎస్‌ఎస్ కోరారు. దాన్ని మేమే వేస్తున్నామన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కపట నాటకానికి తెర తీసిందని ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment