గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సీట్ల కేటాయింపుల విషయంలో ఇప్పటికే పలు పార్టీలలో లుకలుకలు బయట పడుతుండగా.. తాజాగా ఓ ఎమ్మెల్యే వాహనం పై అసమ్మతి వర్గానికి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఈ సంఘటన నగరంలోని ఉప్పల్‌లో గురువారం చోటుచేసుకుంది. ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ కారును అడ్డుకున్న కొందరు స్థానికులు దాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.