ఇద్దరు టీఎంసీ ఎ‍మ్మెల్యేలపై దాడి | Two Trinamool Congress MLAs Attacked By Own Party Workers | Sakshi
Sakshi News home page

ఇద్దరు టీఎంసీ ఎ‍మ్మెల్యేలపై దాడి

Published Sat, Nov 2 2024 7:58 AM | Last Updated on Sat, Nov 2 2024 9:55 AM

Two Trinamool Congress MLAs Attacked By Own Party Workers

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి  జరిగింది. వీరిపై వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మింఖాకు చెందిన టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్‌పైన, సందేశ్‌ఖాలీకి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే సుకుమార్ మహతాపైన దాడి జరిగింది. పోలీసులు ఈ రెండు కేసులను నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ఎమ్మెల్యే ఉషారాణి మండల్‌ కాళీపూజ మండపానికి వెళ్లి, పూజలు నిర్వహించి, తిరిగి వస్తుండగా ఆమెపై దాడి జరిగింది. హరోవా ప్రాంతంలో 150 మంది  ఆమెను చుట్టుముట్టారు. తనను కారులోంచి బయటకు లాగి తుపాకీతో కాల్పులు జరిపారని టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అక్రమ కార్యకలాపాలకు పాల్పడి, పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేత తనపై దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు.

ఇదేవిధంగా సందేశ్‌ఖాలీకి చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుకుమార్‌ మహతాపై దాడి  జరిగింది. నజత్‌లో జరిగిన కాళీ పూజకు వెళ్లి, తిరిగి వస్తుండగా ఎమ్మెల్యే సుకుమార్ మహతాపై దాడి జరిగింది. దాడి అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తాను కాళీ పూజ పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, కొందరు దుండగులు తన వాహనంపై దాడి చేశారన్నారు. అలాగే తనతో పాటు వస్తున్న పార్టీ కార్యకర్తలపైనా దాడి  చేశారన్నారు. తీవ్రంగా గాయపడిన ఒక కార్యకర్తను ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. ప్రత్యర్థి వర్గం వారే ఈ దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే సుకుమార్‌ మహతా ఆరోపించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసుల్లో కొందరిని అరెస్టు చేయగా, మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement