నిందితులను శిక్షించేందుకు 10 రోజుల్లో చట్టం: సీఎం మమత | BJP 12 hours Bengal bandh over police action on protest updates | Sakshi
Sakshi News home page

నిందితులను శిక్షించేందుకు 10 రోజుల్లో చట్టం: సీఎం మమత

Published Wed, Aug 28 2024 7:18 AM | Last Updated on Wed, Aug 28 2024 3:10 PM

BJP 12 hours Bengal bandh over police action on protest updates

Updates  

  • బెంగాల్‌లో బీజీపీ బంద్‌ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం మమతా  బెనర్జీ స్పందించారు. ‘‘వచ్చే వారం అసెంబ్లీ సమావేశాన్ని జరిపించి నిందితులకు ఉరిశిక్షను నిర్ధారించడానికి 10 రోజుల్లో బిల్లును ఆమోదిస్తాం. ఆ బిల్లును గవర్నర్‌కు పంపుతాము. ఆయన  ఆమోదించకపోతే మేము రాజ్‌భవన్ ముందు కూర్చొని  నిరసన తెలుపుతాం. ఈ బిల్లు తప్పక ఆమోదించబడుతుంది.  గవర్నర్‌ ఈసారి తన జవాబుదారీతనం నుంచి తప్పించులేరు’అని మమత స్పష్టం చేశారు.

 

  • బీజేపీ బంద్‌లో భాగంగా బీజేపీ కార్యకర్తలు అసన్‌సోల్‌ రైల్వే స్టేషన్‌ పట్టాలపై కూర్చొని నిరసన  తెలిపారు.

 

  • బెంగాల్‌ బీజేపీ బంద్‌ నిరసనలో కేంద్ర మంత్రి సుకాంత మజుందార్‌ పాల్గొని మీడియాతో మాట్లాడారు.  ‘‘ఏడు రోజుల పాటుచేసే ధర్నాకు కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ధర్నా ప్రారంభిస్తాం. కోర్టు  తీర్పును స్వాగతిస్తున్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. పోలీసులు కాల్పులు ఆపలేరు. బీజేపీ నిరసనను అడ్డుకుంటారు. హత్యాచార ఘటన నిందితును అరెస్ట్‌ చేయరు. కానీ బీజేపీ నేతలను అరెస్ట్‌ చేస్తారు’’ అని అన్నారు.

     

     

 

  • కోల్‌కతాలో 12 గంటల బీజేపీ బంద్‌లో బీజేపీ నేత కారుపై జరిగిన  కాల్పుల్లో   డ్రైవర్‌ మృతి  చెందాడు.

     

  • కోల్‌కతాలో 12 గంటల బీజేపీ బంద్‌ కొనసాగుతోంది. బంద్‌ సందర్భంగా పోలీసుల తీరు నిరసిస్తూ.. బీజేపీ చేపట్టిన ర్యాలీలో  బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్‌, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్‌ పాల్గొన్నారు.

     

 

  • బెంగాల్‌ ఉత్తర 24 పరగణాలులో భాట్పరా ప్రాంతంలో బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై కాల్పులు, దాడి ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.

      

 

  • బీజేపీ బంద్‌  హింసాత్మకంగా  మారింది. తమ పార్టీ నేత ప్రియాంగు పాండే కారుపై కాల్పులు జరిగాయని బీజేపీ నేత అర్జున్‌ సింగ్‌ తెలిపారు. ‘ప్రియాంగు కారుపై ఏడు  రౌండ్ల కాల్పులు జరిగాయి.  ఈ కాల్పులు ఏసీపీ సమక్షంలోనే జరిగాయి. ప్రియాంగు పాండేని చంపేందుకు ప్లాన్ చేశారు. టీఎంసీ ఇలాంటి పనులు చేస్తోంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి’అని అన్నారు.

     

  •  పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా నందిగ్రామ్‌లో పార్టీ కార్యకర్తలతో సువేందు అధికారి నిరసనలో పాల్గొన్నారు.

 


  •  

  • కోల్‌కతా బాటా చౌక్‌లో బంద్‌ చేపట్టిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు.  బంద్‌లో పాల్గొన్న  బీజేపీ  నేత లాకెట్‌ ఛటర్జీని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

     

     

  •  బంద్‌ కొనసాగుతోందని పోలీసులు ఏమీ చేయలేకపోయారని బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కీర్తానియా అన్నారు. ‘టీఎంసీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు.వారిని సీఎం మమత  ఇక్కడి పంపారు. కానీ, మేం ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లము. మేము చేపట్టిన బెంగాల్‌ బంద్‌ను కొనసాగిస్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం’ అని ఆయన అన్నారు.
  • సిలిగురిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల 'బెంగాల్ బంద్’ కొనసాగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు మోహరించారు.


     

  • బీజేపీ చేపట్టిన బంద్‌ను వ్యతిరేకిస్తూ అధికార టీఎంసీ కార్యకర్తలు ఉత్తర పరగణాల రైల్వే స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. రైలు పట్టాల మీద పెద్దఎత్తున నిరసన తెలపటంతో బంగాన్-సీల్దా మధ్య రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. తర్వాత మళ్లీ రైలు సేవలను అధికారులు పునరుద్దరించారు.

     

     

  • బీజేపీ బంద్‌ నేపథ్యంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్లు హెల్మెట్స్‌ ధరించారు. ‘‘ఈ రోజు బంద్‌ ఉంది. కావున తాను హెల్మెట్‌ ధరించాను’’ అని బస్‌ డ్రైవర్‌ తెలిపారు.

     

  • కోల్‌కతాలో  బీజేపీ  బంద్‌ను పోలీసులు అడ్డుకుంటున్నారు. అలీపుర్దువార్‌ ప్రాంతంలో బంద్‌ నిర్వహిస్తున్న పలువురు బీజేపీ  కార్యకర్తలను బలవంతంగా పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. దీంతలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది

  • పోలీసు తీరుపై బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల  బంద్‌  బెంగాల్‌లో కొనసాగుతోంది.
  • పోలీసులు అణచివేయాలనే వైఖరితో తిరుగుతున్నారని బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్‌ మాట్లాడారు. కార్యకర్తలతో కలిసి రోడ్డు మీద వచ్చిన ఆమె బీజేపీ బంద్‌కు సహరించాలని కోరుతున్నారు.  అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు రద్దు చేశారు.ఆందోళనకారులపై రసాయనాలు కలిపిన వాటర్‌ కెనాన్‌లను ప్రయోగించారు. పోలీసులు రాష్ట్రంలోని మహిళలకు భద్రత కల్పించలేకపోతున్నారు’ అని  అన్నారు. బంద్‌ను విజయవంతంగా కొనసాగిస్తామని అన్నారు.

 

పశ్చిమ బెంగాల్‌ల్‌లో ఇవాళ(బుధవారం) ఉదయం 6  గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ పిలుపుచ్చిన బంద్‌ నేపథ్యంలో పోలీసులు మరింత  అప్రమత్తం అయ్యారు. సుమారు 5 వేల మంది పోలీసులను పలు కీలకమైన చోట్ల మోహరించారు. 15 మంది సీడీపీ ర్యాంక్‌ పోలీసు అధికారులను పలు కీలకమైన ప్రాంతాల్లో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ బంద్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఏసీపీ ఎప్పటికప్పుడు లా అండ్‌ ఆర్డర్‌ను పర్యవేక్షిస్తారని పోలీసులు పేర్కొన్నారు. బంద్‌ను పరిశీలించడానికి పలు ప్రాంతాలో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

 

కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో జానియర్‌ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్‌ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారింది. నగరవ్యాప్తంగానే గాక సమీపంలోని హౌరాలో కూడా విద్యార్థులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడి, లాఠీచార్జి ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. ఇక.. శాంతియుత ర్యాలీపై ఇదెక్కడి అమానుషత్వమంటూ పోలీసులు, సీఎం మమతా ప్రభుత్వంపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. బంధవారం 12 గంటల పాటు బెంగాల్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. దీన్ని అధికార తృణ మూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబట్టింది. బంద్‌ జరగనిచ్చే ప్రసక్తే లేదని మమత ముఖ్య సలహాదారు ఆలాపన్‌ బంధోపాధ్యాయ్‌ అనటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement