వాళ్లనెప్పుడూ బెదిరించలేదు: మమతా బెనర్జీ | Mamata Banerjee Denies Threatening Protesting Doctors, Do Not Utter A Single Word | Sakshi
Sakshi News home page

Mamata Banerjee: వాళ్లనెప్పుడూ బెదిరించలేదు

Published Thu, Aug 29 2024 2:06 PM | Last Updated on Thu, Aug 29 2024 3:32 PM

Mamata Banerjee Denied Threat To Doctors Do Not utter single word

కోల్‌కతా: తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్ మీడియా సంస్థలు తప్పుగా వక్రీకరించాయని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ  మండిపడ్డారు.   బుధవారం పార్టీ విద్యార్థి విభాగం  కార్యక్రమంలో చేసిన ప్రసంగంపై కొన్ని  మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశాయని ‘ఎక్స్‌’ వేదికగా వివరణ   ఇచ్చారామె.  తాను డాక్టర్లను బెందిరించలేదని బీజేపీ ఆరోపణలకు సీఎం మమత కౌంటర్‌ ఇచ్చారు. 

‘నేను వైద్య విద్యార్థులు, ప్రజా  సంఘాల ఉద్యమాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. వారి ఉద్యమానికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నా. నాపై ఆరోపణలు చేసినవారిని నేను ఎప్పుడూ బెదిరించలేదు. నేను బెదింరించినట్లు  చేస్తున్న ఆరోపణలు పూర్తిగా  అసత్యం. నేను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తున్నారు. 

అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను బీజేపీ వాళ్లకు వ్యతిరేకంగా నా గళాన్ని వినిపించాను. నా ప్రసంగంలో ఉపయోగించిన పదాలు శ్రీ రామకృష్ణ పరమహంసకు సంబంధించినవి అని స్పష్టం చేశాను. సాధువు సైతం కొన్ని సమయాల్లో స్వరం పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నేరాలు, నేరాలు జరిగినప్పుడు నిరసన గళం వినిపించాలని శ్రీరామకృష్ణ ప్రస్తావన తీసుకొని మాట్లాడాను’ అని మమత స్పష్టం చేశారు.

 

అయితే బుధవారం సీఎం మమత బెనర్జీ తన ప్రసంగం డాక్టర్లను బెదిస్తున్నట్లు ఉందని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. రాబోయే రోజుల్లో టీఎంసీ విద్యార్థి విభాగంలోని విద్యార్థుల పని కుట్రదారుల ముసుగు విప్పడం, వారిని భయపెట్టడమని సీఎం మమత అన్నారని  తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యతో  ఆమె నిరసన తెలిపే డాక్టర్లను బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement