కలకత్తా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. తూర్పు మిడ్నపూర్‌లో ఎన్‌ఐఏ అధికారులపై టీఎంసీ కార్యకర్తల దాడిని ప్రధాని ఖండించారు. ఆదివారం జల్పాయ్‌గురిలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.‘వారి పార్టీ అవినీతి నేతలను స్వేచ్ఛగా వదిలేయాలని తృణమూల్ భావిస్తోంది.
దర్యాప్తు సంస్థలు వస్తే వారిపైనే దాడి చేస్తారు. శాంతిభద్రతలను నాశనం చేయడానికి టీఎంసీ కంకణం కట్టుకుంది. వారికి రాజ్యాంగంతో పని లేదు’ అని విమర్శలు గుప్పించారు. తూర్పు మిడ్నపూర్‌లో ఎన్‌ఐఏ అధికారులపై దాడులు జరిగిన మరునాడే ప్రధాని స్పందించడం చర్చనీయంశమైంది.కాగా, ఇది ఎన్‌ఐఏ అధికారులపై జరిగిన దాడి కాదని వాళ్లు తూర్పు మిడ్నపూర్‌లోని భూపతినగర్ గ్రామ వాసులపై చేసిన దాడి అని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు.
ఇదీ చదవండి.. మరో పదేళ్లు హేమమాలినీనే ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment