![We Will Do Complete Liquor Ban In Telangana Says NVSS Prabhakar - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/13/NVSS-Prabhakar.jpg.webp?itok=h8H0CS9M)
బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తామని బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలిపారు. సాయంత్రం ఆరుగంటలకంతా మద్యం అమ్మకాలు నిలిపివేయాలని, బార్లు కూడా సాయంత్రం ఆరు గంటలకు మూసివేయాలన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం మహమ్మారి ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తోందని, అందుకే మద్యపాన నియంత్రణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాతరకు వెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. హనుమాన్, అయ్యప్ప, అమ్మవారి దీక్ష ముగిసి ఆలయాలకు వెళ్లేవారికోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు.
వక్ఫ్, ఎండోమెంట్, క్రైస్తవ దేవాలయాల భూమల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల కోసం ఆన్‌లైన్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ పంచాయతీ నుంచి గ్రేటర్ మున్సిపాలిటీ వరకు ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఉద్యోగ భద్రత, హెల్త్ స్కీం కల్పిస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లపై అత్యధిక వ్యాట్ తెలంగాణ వసూలు చేస్తోందని అన్నారు. తెలంగాణ వసూలు చేస్తున్న వ్యాట్‌ను తాము అధికారంలోకి వస్తే ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment