కేసీఆర్ నిజస్వరూపాన్ని బయటపెడతాడనే... | NVSS Prabhakar takes on trs party and cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ నిజస్వరూపాన్ని బయటపెడతాడనే...

Published Sun, Aug 31 2014 12:52 PM | Last Updated on Tue, Oct 16 2018 3:09 PM

కేసీఆర్ నిజస్వరూపాన్ని బయటపెడతాడనే... - Sakshi

కేసీఆర్ నిజస్వరూపాన్ని బయటపెడతాడనే...

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతున్నా ఎన్నికల నాటీ హమీలు ఒక్కటీ నెరవేర్చలేకపోయిందని ఉప్పల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన విమర్శించారు. ఆదివారం ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ సీఎం కేసీఆర్ నిజస్వరూపాన్ని జగ్గారెడ్డి బయటపెడతాడనే భయంతో ఆయనపై టీఆర్ఎస్ ఎదురు దాడి చేస్తోందని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన సీపీఎం మద్దతు ఎలా అడుగుతారని ఆయన టీఆర్ఎస్ను ప్రశ్నించారు. మెదక్ ప్రజలను కేసీఆర్ ఎన్నో సార్లు అవమానించారని ఈ సందర్భంగా ప్రభాకర్ గుర్తు చేశారు. మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమని ప్రభాకర్ జోస్యం చెప్పారు. మూడు నెలల పాలనపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన టీఆర్ఎస్కు సవాల్ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement