
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పుడు అది ఒక జ్ఞాపకమేనన్నారు. భారత్‌లో ప్రస్తుతం నియంత పాలన నడుస్తోందని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని స్వతంత్ర సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రిస్తోందని ఆరోపించారు.
దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది కాంగ్రెస్. దీనికి ముందు ఢిల్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ.. మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
భారత్ నలుగురు వ్యక్తుల నియంతృత్వంలో ఉందని రాహుల్ పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను చర్చించడానికి అవకాశం ఇవ్వట్లేదన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. నిబంధనలకు విరుద్దంగా నిరసనలు చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆంక్షలు విధించారు.
చదవండి: జుమ్లానామిక్స్‌ను దాచలేరు.. నిర్మలవి అసత్యాలు..
Comments
Please login to add a commentAdd a comment