27 సెప్టెంబర్, 1988 ఎర్రజెండా ఎగిరింది!
కడుపులో చల్ల కదలకుండా మయన్మార్ సింహాసనంపై నింపాదిగా కూర్చున్న ‘నియంతృత్వం’ వెన్నులో చలి పుట్టిన చారిత్రక రోజు ఇది. దీనికి కారణం...‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ పార్టీ పుట్టుక. ప్రజాస్వామ్య నినాదంతో ప్రజల ముందుకు వచ్చింది ఎన్‌ల్‌డి. నోబెల్ బహుమతిగ్రహీత ఆంగ్‌సాన్ సూకి ఈ పార్టీకి జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు.
సూకీ పార్టీనీ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. మిలటరీ నియంత పాలకులు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ, ప్రజా తీర్పు ప్రతిఫలించకుండా జాగ్రత్త పడ్డప్పటికీ 1990 పార్లమెంటరీ ఎన్నికలలో 392 స్థానాలను గెలుచుకుంది ఎన్‌ఎల్‌డి. అయితే ప్రజా తీర్పును నియంత పాలకులు ఆమోదించలేదు. ఆ తరువాత ఎన్ని పరిణామాలు జరిగినప్పటికీ బర్మా రాజకీయచరిత్రలో ‘ఎన్‌ఎల్‌డి’ ఆవిర్భావం కీలక మార్పులకు దారి తీసింది.