న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం కొనసాగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. నియంతృత్వాన్ని ప్రశి్నస్తూ ప్రతిపక్షాలన్నీ ఒక్కటై బిగ్గరగా గర్జిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 24 గంటల్లో జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు.
నిజాయతీకి ప్రతిరూపమైన కేజ్రీవాల్‌ను కుట్రపూరితంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదలైన సిసోడియా శనివారం ‘ఆప్’ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు.
17 నెలల తర్వాత స్వతంత్రమైన సూర్యోదయం
తన భార్యతో కలిసి తేనీరు సేవిస్తున్న ఫొటోను మనీష్ సిసోడియా శనివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. 17 నెలల తర్వాత స్వతంత్రమైన సూర్యోదయాన మొదటి తేనీరు అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment