న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ న్యాయస్థానం మే 12వ తేదీ దాకా పొడిగించింది. ఈ మేరకు ప్రత్యేక జడ్జి ఎం.ఎం.నాగపాల్ గురు వారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ కేసులో ఈ నెల 25న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ ఈ–కాపీని సిసోడియాకు అందజేయాలని సీబీఐని ఆదేశించారు. విచారణ పూర్తి కాకుండానే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిందని, సిసోడియాకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది రిషికేశ్ కోరారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అనుబంధ చార్జిషీట్ ఈ–కాపీని సిసోడియాకు ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment