Former Deputy Chief Minister
-
12 దాకా సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ న్యాయస్థానం మే 12వ తేదీ దాకా పొడిగించింది. ఈ మేరకు ప్రత్యేక జడ్జి ఎం.ఎం.నాగపాల్ గురు వారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఈ నెల 25న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ ఈ–కాపీని సిసోడియాకు అందజేయాలని సీబీఐని ఆదేశించారు. విచారణ పూర్తి కాకుండానే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిందని, సిసోడియాకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది రిషికేశ్ కోరారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అనుబంధ చార్జిషీట్ ఈ–కాపీని సిసోడియాకు ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేశారు. -
మాజీ ఉప ముఖ్యమంత్రి పీఏ ఆత్మహత్య
సాక్షి బెంగళూరు: ఐటీ దాడుల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రమేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐటీ శాఖ అధికారులు గత మూడు రోజులుగా పరమేశ్వర్ ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పరమేశ్వర్ సన్నిహితుడు, పీఏ రమేశ్ ఇంటిలో కూడా సోదాలు చేపట్టారు. ఈ సోదాల నేపథ్యంలో ఆయన శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరులోని జ్ఞాన భారతి విశ్వవిద్యాలయం ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. అంతకుముందు తన ఇద్దరు స్నేహితులకు రమేశ్ ఫోన్ చేసి ‘నేను పేదవాడిని, నాపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టింది. ఎంతో నిజాయితీగా బతికాను. ఐటీ అధికారుల విచారణను ఎదుర్కొనే శక్తి నాకు లేదు. వారి ప్రశ్నలను ఎదుర్కోలేను’ అని చెప్పినట్లు తెలిసింది. -
నేనా.. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీనా..?
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తరఫున వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీచేస్తారనే వార్తలపై మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య స్పందించారు. తాను టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, జీవితాంతం సీఎం కేసీఆర్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం రాజయ్య విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వరంగల్ లోక్‌సభా నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు జరుగుతున్నదంతా అసత్య ప్రచారమేనని ఆయన అన్నారు. వరంగల్ ఎంపీ స్థానంలో ఆయన కానీ, ఆయన భార్య కానీ కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ను విడిచి పెట్టడం లేదని, బంగారు తెలంగాణలో భాగస్వామిని అవుతానని పేర్కొన్నారు. తనను కావాలనే కొందరు వివాదాల్లోకి లాగుతున్నారని, ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అని డాక్టర్ రాజయ్య వివరించారు. -
మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ పర్యటన
కోటగుమ్మం(రాజమండ్రి): విభాజ్య ఆంధ్రప్రదేశ్ చివరి ఉప ముఖ్యమంత్రి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రూపకర్త సి. దామోదర రాజనరసింహ జిల్లాలో పర్యటించారు. శనివారం ఉదయం రాజమండ్రికి చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, నగర అధ్యక్షులు ఎన్.వి. శ్రీనివాస్, దళిత నాయకులు తాళ్ళూరి విజయ్ కుమార్ ఆయన కు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన గోకవరం బస్టాండ్ వద్దగల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయం సందర్శించి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ నాయకులు తాళ్లూరి బాబూ రాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి, కొమరాపు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.10 వేల కోట్ల కరువు ప్యాకేజీ ప్రకటించాలి
మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ డిమాండ్ నాగపూర్: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువుపరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ఆయన బుధవారం అసెంబ్లీలో ఈ విషయమై మాట్లాడారు. నాగపూర్ విధాన సభలో బుధవారం సమావేశం మొదలవ్వగానే కాంగ్రెస్ పక్ష డిప్యూటీ నాయకుడు విజయ్ వడ్డేటివార్ మాట్లాడుతూ.. కరువు, రైతు ఆత్మహత్యలపై చర్చ జరపాలని కోరారు. కాగా, సదరు అంశాలపై చర్చకు రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే అంగీకరించారు. స్పీకర్ అనుమతి ఇచ్చిన అనంతరం పవార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మరాఠ్వాడా, విదర్భల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడి సోయ, పాడి రైతులను వెంటనే ఆదుకోవాలని అన్నారు. అలాగే ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల భార్యలకు వితంతు పింఛను మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాడి రైతుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. లీటర్ మంచినీళ్లు రూ.20 ఉంటే, లీటర్ పాలు రూ.17 ఉన్నాయని, దీన్ని బట్టే పాడి పరిశ్రమ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. కౌన్సిల్లో గందరగోళం..: కాగా, కరువు, రైతు సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో విధాన మండలిలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాలు కొన్నిసార్లు వెల్‌లోకి దూసుకురావడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. ఈ గందరగోళంలోనే కౌన్సిల్ నాయకుడిగా ఏక్నాథ్ ఖడ్సేను, డిప్యూటీ నాయకుడిగా చంద్రకాంత్ పాటిల్ పేర్లను ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం తన మంత్రివర్గ సహచరులను సభకు పరిచయం చేశారు. కాగా, శీతాకాల సమావేశాలు ప్రారంభమై మూడు రోజులైనా ప్రతిపక్ష నేతను ఖ రారుచేయకపోవడంపై షేత్కారీ కాంగార్ పక్ష (ఎస్కేపీ)కి చెందిన ఎమ్మెల్యే జయంత్ పాటిల్ ప్రశ్నించారు. ప్రతిపక్షనేత లేకుండా సభ నడవడం చరిత్రలో ఇదే మొదటిసారని, ఇది సరైన సంప్రదాయం కాదని ఆయన ఆరోపించారు. పాటిల్‌కు మద్దతుగా కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు నిలిచారు. కాగా, ఒకటి, రెండు రోజుల్లో ప్రతిపక్ష నేతను చైర్మన్ నిర్ణయిస్తారని డిప్యూటీ చైర్పర్సన్ వసంత్‌రావ్ దావ్‌ఖరే ప్రక టించారు. కాగా, ప్రతిపక్ష నేతను ఏ విధానంపై నిర్ణయించనున్నారో తెలపాలని ఎన్సీపీ నేత సునీల్ తత్కారే డిమాండ్ చేశారు. తమపార్టీ తరఫున ధనంజయ్ ముండే పేరును ఇప్పటికే ప్రతిపాదించామన్నారు. కాగా, కాంగ్రెస్ నేత మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. మొదట ఎన్సీపీ తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ‘గతంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉంటామని ప్రకటించారు.. ఇప్పుడు ప్రతిపక్ష నేత సీటు కావాలంటున్నారు..’ అని వ్యాఖ్యానించారు. కాగా ప్రతిపక్ష నేత పదవి కోసం బీజేపీ నుంచి ధనంజయ్ ముండే, కాంగ్రెస్ నుంచి మాణిక్‌రావ్ ఠాక్రే పేర్లను ప్రతిపాదిస్తూ తనకు లేఖలు అందినట్లు మండలి చైర్మన్ శివాజీరావ్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ఓటమి తర్వాతే రైతులు గుర్తుకొచ్చారా..: అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీలకు రైతులు గుర్తుకువస్తున్నారని శివసేన విమర్శించింది. 15 యేళ్లుగా వారే రాష్ట్రాన్ని పాలించారు.. వారి అవినీతి పాలనే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆరోపించింది. మూడు రోజులుగా వారు అసెంబ్లీ సమావేశాల్లో డ్రామా నడుపుతున్నారని బుధవారం నాటి సామ్నా సంపాదకీయంలో తీవ్రంగా దుయ్యబట్టింది.