మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ పర్యటన | Former Deputy Chief rajanarasinha tour | Sakshi
Sakshi News home page

మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ పర్యటన

Published Sun, Jan 25 2015 12:50 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ  పర్యటన - Sakshi

మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ పర్యటన

కోటగుమ్మం(రాజమండ్రి): విభాజ్య ఆంధ్రప్రదేశ్ చివరి ఉప ముఖ్యమంత్రి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రూపకర్త సి. దామోదర రాజనరసింహ జిల్లాలో పర్యటించారు. శనివారం ఉదయం రాజమండ్రికి చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, నగర అధ్యక్షులు ఎన్.వి. శ్రీనివాస్, దళిత నాయకులు తాళ్ళూరి విజయ్ కుమార్ ఆయన కు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన గోకవరం బస్టాండ్ వద్దగల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయం సందర్శించి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ నాయకులు తాళ్లూరి బాబూ రాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి, కొమరాపు మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement