rajanara Simha
-
మయోనైజ్‌పై నిషేధం
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్ వినియోగంపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 అక్టోబర్ చివరివరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా జరిగిన అనేక ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలకు పచ్చిగుడ్లతో చేసిన మయోనైజ్ కారణమని గుర్తించామని పేర్కొన్నారు. మయోనైజ్ సాధారణంగా శాండ్విచ్లు, సలాడ్లు, స్నాక్స్ వంటి వాటిల్లో రుచి కోసం వినియోగిస్తారు. గ్రిల్డ్, తందూరి చికెన్, కబాబ్‌లు వంటి వాటితో కూడా కలిపి తీసుకుంటుంటారు. మంత్రి సమీక్ష నేపథ్యంలో.. ఆహార భ్రద్రతపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం సమీక్ష నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ కమిటీల పనితీరుపై ఆరా తీశారు. 235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, గోడౌన్లలో తనిఖీలు చేశామని, 170 సంస్థలకు నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ టాస్క్‌ఫోర్స్ అధికారులు వివరించారు. దీంతో జిల్లాల్లోనూ విరివిగా తనిఖీలు చేయాలని, ఇందుకోసం రెండు టాస్‌్కఫోర్స్ కమిటీలను నియమించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో మోమోస్ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను కల్తీ గుడ్లు, ఉడకబెట్టని గుడ్లతో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అధికారులు వివరించారు. మయోనైజ్ క్వాలిటీ, అది తిన్న తర్వాత కలిగిన దుష్పరిణామాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కేరళలో ఈ తరహా మయోనైజ్ తయారీని అక్కడి ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రంలో కూడా నిషేధం విధించాలని సూచించారు. దీంతో పలువురు డాక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. మయోనైజ్‌పై నిషేధం విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆహార భద్రతపై అధ్యయనం చేయండి రాష్ట్రంలో గత పదేళ్లలో హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, హాస్టళ్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ఆహార భద్రతా విభాగం బలోపేతం కాలేదని, కొత్త పోస్టులు మంజూరు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఫుడ్ సేఫ్టీలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నామని, 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్, డైరెక్టర్ శివలీల, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు మూర్తి రాజు, అమృత, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత ప్రమాణాలు లేకుంటే సీజ్ చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాణ్యత, ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. నాణ్యత లేకుండా ఇష్టానుసారంగా నిర్వహించే ఫుడ్ యూనిట్లను ఏమాత్రం సంకోచం లేకుండా సీజ్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ తప్పకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్–2006కు లోబడి నిర్వహించాలన్నారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో మంత్రి రాజనర్సింహ ఫుడ్ సేఫ్టీ అంశంపై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహార పదార్థాలను విక్రయించి ఇతర రాష్ట్రాలతో తెలంగాణ ఆదర్శంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆహార తనిఖీ బృందాలు నిరంతరం ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తూనే ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఫుడ్ లాబ్స్ ద్వారా రోజుకు 180 నుంచి 200 ఫుడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించాలని, ఏమాత్రం లోపాలు గుర్తించినా వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్స్, ప్రైవేటు బోర్డింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్, బేకరీలు, డెయిరీ ఫుడ్ తయారీదారులు, రెస్టారెంట్లు, హోటళ్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ యూనిట్లు తప్పనిసరిగా రిజి్రస్టేషన్ చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారం నాణ్యత ప్రమాణాలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై మంత్రి దామోదర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రతి శనివారం మొబైల్ ఫుడ్ లాబ్స్ ద్వారా చేపట్టిన పరీక్షల వివరాల నివేదికను తనకు అందించాలన్నారు. ఫుడ్ సేఫ్టీపై ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్‌తో అవగాహన సదస్సులను నిర్వహించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల, స్టేట్ ఫుడ్ ల్యాబ్స్ హెడ్ లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కార్యకర్తలకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఔట్సో ర్సింగ్ ఉద్యోగాలలో కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నర్సింహ హామీ ఇచ్చారు. బాన్సువాడలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చారన్నారు. ప్రస్తుతం అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో నంబర్ 317పై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరాల దృష్ట్యా మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్‌గా మంత్రి దామోదర, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఉంటారు. 2021లో ఇచ్చిన జీవో 317, జీవో 46పై వివాదాలు, ఉద్యోగుల అభ్యంతరాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. పీఆర్టీయూటీఎస్ హర్షం గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317పై ఉద్యోగుల అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబ్‌నెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం పట్ల పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. 317 జీవోతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు: టీఎస్‌యూటీఎఫ్ ఉద్యోగుల శాశ్వత కేటాయింపు కోసం గత ప్రభు త్వం జీవో 317 ద్వారా ఏకపక్షంగా విడుదల చేసిన మార్గదర్శకాల కారణంగా పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫారసు చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. జీవో 46పై సబ్ కమిటీతో నిరుద్యోగులకు న్యాయం: బల్మూరి వెంకట్ జీవో నంబర్ 46పై కేబినెట్ సబ్ కమిటీ వేయడాన్ని ఎంఎల్‌సి బల్మూరి వెంకట్ స్వాగతించారు. జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తాము సూచనలు, సల హాలు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని వెంకట్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి అన్యా యం జరగకుండా సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పీఆర్ కమిషనర్‌కు టీపీఎస్ఏ వినతిపత్రం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలు, బదిలీలపై గత సర్కార్ ఇచ్చిన జీవో 317తో ముడిపడిన సమస్యల పరిశీలనకు సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్ సబ్‌కమిటీని నియమించడం పట్ల తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) హర్షం ప్రకటించింది. ఈ జీవో కారణంగా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్‌కు టీఎస్పీఏ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం పీఆర్ కమిషనరేట్‌లో కమిషనర్‌కు టీఎస్పీఏ ప్రతినిధులు మధుసూదన్‌రెడ్డి, .శ్రీనివాస్, పండరీనాథ్ వినతిపత్రం సమర్పించారు. ఈ జీవో వల్ల కొందరు కార్యదర్శులు స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరంగా ఇబ్బందులుపడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. -
TS: ఒక్కరోజులో 12 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం 1,322 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ వెల్లడించారు. ఈ మేరకు కరోనా బులెటిన్ విడుదల చేశారు. నమోదైన కేసుల్లో తొమ్మిది హైదరాబాదులోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం 38 మంది ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.44 లక్షలకు చేరింది. అందులో 8.40 లక్షల మంది రికవరీ అయ్యారు. చలికాలం కావడం, ఫ్లూ జ్వరాలు కూడా ఉండటం తదితర కారణాలతో కరోనా కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. పర్యాటకులకు తప్పనిసరి ఐసోలేషన్ తాజాగా రాష్ట్రంలోకి వచ్చే పర్యాటకుల కోసం తప్పనిసరి ఐసోలేషన్‌ను ప్రారంభించాలని రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ వైద్యుల ప్యానెల్ వైద్య ఆరోగ్య శాఖకు సూచించింది. పొరుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ, గోవా, మహారాష్ట్రలలో కోవిడ్ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని కోరింది. జేఎన్.1 వేరియంట్ పై స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉందని పేర్కొంది. కేరళ లేదా ఇతర ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారు ఎవరైనా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. పైగా చాలా మందిలో వైరస్ లక్షణాలు కనిపించడం లేదనిడాక్టర్ల బృందం అభిప్రాయపడింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 40 నమూనాలు..: రాష్ట్రంలో కరోనా కేసులు ఏ వేరియంట్ అనేది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు. గత వారం మొత్తం 40 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 4–5 రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. సమావేశంలో మంత్రి ఆదేశాలిలా.. పని చేయని పీఎస్ఏ ప్లాంట్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సరిగ్గా వినియోగించాలి. అన్ని వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకురావాలి. వైద్య పరికరాలు, డ్రగ్స్, డయాగ్నస్టిక్స్ మొదలైన వాటి అవసరాలను ఆసుపత్రులు తెలియజేయాలి. మొత్తం 34 ప్రభుత్వ ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు రోజుకు 16,500 నమూనాలను పరీక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 34 ప్రభుత్వ ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లతో పాటు, రాష్ట్రంలో 84 ప్రైవేట్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు ఉన్నాయి. ఆర్టీపీసీఆర్ కిట్లు మొదలైన వాటిని టిఎస్ఎంఎస్ఐడిసి సేకరించి సరఫరా చేస్తుంది. గత 2 వారాల్లో మొత్తం 6,344 నమూనాలు సేకరించారు. నెలాఖరు నాటికి పరీక్షలను వేగవంతం చేయాలి. రోజుకు 4,000 పరీక్షలు నిర్వహించాలి. గాంధీ హాస్పిటల్లోనూ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పంపాలి కోవిడ్ రోజువారీ నివేదికను ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలి. కరోనాను ఎదుర్కొనేందుకు వివిధ సంస్థల నుంచి గత నాలుగేళ్లుగా అందిన సీఎస్ఆర్ విరాళాల జాబితాపై నివేదిక అందజేయాలి. -
ఆయనంతే అదో టైపు.. మౌనం వెనుక వ్యూహం ఏంటి?
ఆయనంటేనే అదో టైపు.. అందులో సీనియర్... ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేత.. మీడియా ముందే బాహాటంగానే కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని పార్టీలో నెలగడం కష్టమని ఆరోపించారు.. కానీ ఇప్పుడు ఆ నేత ఇంట్లో నుంచే ఒకే నియోజకవర్గానికి... రెండు దరఖాస్తులు చేసుకున్నారు.. దీంతో టికెట్ తండ్రికి వస్తుందా, కూతురును వరిస్తుందా అంటూ పార్టీ క్యాడర్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకు ఒకింట్లో రెండు టికెట్ల పంచాయతీ ఏంటి? సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ స్థానం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అందోల్ నుండి ఐదు సార్లు పోటీ చేయగా మూడు సార్లు విజయం సాధించారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో వ్యవసాయ, మార్కెట్, ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనర్సింహను హైకమాండ్ నియమించింది. ప్రజలు ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆదరించిన.. తెలంగాణ రాష్టం ఏర్పడినప్పటి నుంచి ఆయనకు రాజకీయాలు కలిసిరావడం లేదు. ఈ సారి ఎలాగైనా గెలవలన్నా పంతంతో పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతూ దామోదర రాజనర్సింహ కూతురు త్రిష.. నియోజకవర్గంలో పల్లె బాట కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్ కార్యకర్తల్లో భరోసానిస్తూ నూతన ఉత్సహన్ని కల్గిస్తుంది. అయితే ఇటీవల గాంధీభవన్‌లో అందోల్ సీటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రి, కూతురు ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అందోల్ కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. గత కొంతకాలం నుంచి త్రిష అందోల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించి నియోజకవర్గంలో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో రోజుకు ఒక గ్రామం చొప్పున పల్లెబాట పేరుతో ప్రజలకు దగ్గరవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల క్యాంపెనింగ్ మొదలుపెట్టారు. అయితే దామోదర రాజనర్సింహ మాత్రం నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాలేకపోతుండడంతో కాంగ్రెస్ శ్రేణులు కొంత అయోమయానికి లోనవుతున్నారు. రాజనర్సింహకు కాంగ్రెస్ అధిష్టానం జాతీయ సీడబ్ల్యుసీ శాశ్వత పదవి కట్ట బెట్టడంతో కార్యకర్తల్లో కొంత ఉత్సాహం నింపిన.. ఆయన ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టకపోవడం, నియోజక వర్గం వైపు కన్నెత్తి చూడకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ముక్కునవేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ టికెట్లు ప్రకటించక ముందు అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అంతే కాదు జహీరాబాద్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం కావడంతో దామోదర రాజనర్సింహ అక్కడి నుండి పోటీ చేస్తారన్న వినికిడి కూడా జోరుగా వినిపించింది. ఏది ఏమైనా దామోదర రాజనర్సింహ మౌనం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అందోల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దామోదర రాజనర్సింహ బరిలో ఉంటారా, కూతురు త్రిష బరిలో ఉంటారా అన్న సందిగ్ధం కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రస్తుతం నెలకొంది. చదవండి: ‘గులాబీ’ వనంలో మౌనరాగం!.. ఏం జరుగుతోంది? -
ప్రగతి భవన్‌ను అంబేడ్కర్ బహుజన్ భవన్‌గా మారుస్తాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్‌ను అంబేడ్కర్ బహుజన్ భవన్‌గా మార్చుతామని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీలో సీఎం ఎవరైనా సరే టీపీసీసీ అధ్యక్షుడిగా తాను సీఎంగా ఉన్న వారితో దళిత, గిరిజనుల విద్య, అభివృద్ధి కోసం మొదటి సంతకం చేయిస్తానని చెప్పారు. బడ్జెట్లో అధిక ప్రాధాన్యం దళిత, గిరిజనుల అభివృద్ధికే కేటాయిస్తామన్నారు. బుధవారం మూడుచింతలపల్లిలోని దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా బుధవారం సాయంత్రం రేవంత్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి రెండు రోజుల దీక్షను విరమింపజేశారు. సీఎంగా కేసీఆర్ రాజభోగాలు అనుభవిస్తున్న ప్రగతిభవన్‌ను అంబేడ్కర్ బహుజన్ భవన్‌గా మార్చి అక్కడి నుంచే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు వెళ్లేలా చేస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దత్తత పేరుతో దగా.. సీఎం కేసీఆర్ దత్తత పేరుతో గ్రామాలను దగా చేశారే తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మూడుచింతలపల్లిని దత్తత తీసుకునే సమయంలో అది చేస్తా, ఇది చేస్తా అని ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ చేయలేదన్నారు. సీఎం దత్తత గ్రామాలపై తాను చర్చకు సిద్ధమని, అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరినా అధికారంలో ఉన్న ఏ ఒక్కరూ స్పందించకపోవడం విడ్డూరమన్నారు. పేదల పిల్లలు చదువుకుంటే రాజ్యాధికారం అడుగుతారని, చైతన్యవంతులు అవుతారని.. అందువల్లే సీఎం కేసీఆర్ 4,632 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, కాలేజీలు మూసివేయించారని ఆరోపించారు. తండ్రి ఓ మాట, కొడుకో మాట హుజూరాబాద్‌లో ఓటమి భయం పట్టుకుందని అందుకే సీఎం కేసీఆర్ ఒకటంటే.. ప్రెస్మీట్లో కుమారుడు కేటీఆర్ మరోటి అంటున్నారని రేవంత్‌రెడ్డి అన్నా రు. కాంగ్రెస్ దండోరా సభలతో కేసీఆర్ అనే ఎలుక బయటికొచ్చిందని వ్యాఖ్యానిం చారు. కేసీఆర్ జపాన్ ఎలుకలాంటి వాడని. ప్రమాదాన్ని ముందే గ్రహించి ఫామ్‌హౌస్ నుంచి బయటికొచ్చారని ఎద్దేవా చేశారు. తాను జీవితంలో సుఖంగా జీవిం చేందుకు దేవుడు అన్నీ ఇచ్చాడని, తనకు పదవుల ఆశ లేదని చరిత్రలో గుర్తుండేలా నిలిస్తే చాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల ఇన్చార్జి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర నాయకులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మల్లు రవి, నందికంటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి వేదిక ఎక్కితే జోకర్... బయట ఉంటే బ్రోకర్ మంత్రి మల్లారెడ్డి వేదిక ఎక్కితే జోకర్.. బయట ఉంటే బ్రోకర్ అని రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని భూ కబ్జాలకు పాల్పడుతున్నాడన్నారు. నియోజకవర్గంలో ఎవరు భూములు అమ్మినా, కొన్నా ఆయన మామూళ్లు వసూలు చేస్తారని ఆరోపించారు. జవహర్‌నగర్‌లో 268 సర్వే నంబర్లో తప్పుడు పత్రాలు సృష్టించి తన కోడలు పేరుతో ఆస్పత్రి నిర్మించారని, సూరారంలో చెరువును కబ్జా చేసి ఆస్పత్రి నిర్మించారని, మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీకి కేటాయించిన భూమిలో తన బావమరిది శ్రీనివాస్‌రెడ్డి పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ధ్వజమెత్తారు. మంత్రి, తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కుమారులు, బావమరిది ఇలా కుటుంబమంతా కబ్జాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మల్లారెడ్డి అక్రమాలపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి అక్రమాలను తాను నిరూపిస్తానని, రుజువు చేయలేకపోతే ఏ శిక్ష విధించినా అంగీకరిస్తానని చెప్పారు. చదవండి: పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్ ఎందుకివ్వరు? -
విజయం ఖాయం
‘‘కొన్నేళ్లుగా పంపిణీ రంగంలో ఉన్నాం. ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’ వంటి హిట్ చిత్రాలను పంపిణీ చేశాం. ఆ అనుభవంతోనే నిర్మాణరంగంలో అడుగుపెట్టి తొలి ప్రయత్నంగా ‘మధుర రాజా’ చిత్రాన్ని తెలుగులో ‘రాజా నరసింహా’గా అనువదించాం. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలన్నదే మా లక్ష్యం’’ అని నిర్మాత సాధు శేఖర్ అన్నారు. మమ్ముట్టి హీరోగా ‘మన్యం పులి’ ఫేం వైశాఖ్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్ కీలక పాత్రల్లో, జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ పేరుతో జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధు శేఖర్ రేపు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ– ‘‘నిర్మాతగా తొలి సినిమా ఇది. కల్తీ సారా వ్యాపారంతో అమాయకుల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తికి ఆ ప్రాంతానికి అండగా నిలిచే రాజా ఎలా బుద్ధి చెప్పాడు అన్నదే కథాంశం. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. చక్కని సందేశం కూడా ఉంది. సన్నీ లియో¯Œ ప్రత్యేక గీతం అదనపు ఆకర్షణ. మా చిత్రం గ్యారెంటీగా హిట్ అవుతుంది’’ అన్నారు. -
సింగూర్ సిగలో ఆందోల్
సాక్షి, జోగిపేట(అందోల్): రాష్ట్ర రాజకీయాల్లో ‘అందోల్’ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి గెలుపొందిన మెజార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కాగా దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రాజనర్సింహ కుటుంబ సభ్యులు అత్యధికంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 19?52లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 2014 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాజనర్సింహ మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. నియోజకవర్గ చరిత్ర 1952లో అందోల్ నియోజకవర్గం ఏర్పడింది. 2009వ సంవత్సరం వరకు అందోల్, పుల్కల్, మునిపల్లి, సదాశివపేట, పుల్కల్, రేగోడ్, అల్లాదుర్గం మండలాలు మాత్రమే ఉన్నాయి. పునర్విభజన అనంతరం సదాశివపేట మండలం సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోకి వెళ్లగా, అందోల్ నియోజకవర్గం పరిధిలోకి కొత్తగా రాయికోడ్, టేక్మాల్ మండలాలు చేర్చారు. 1952 నుంచి 67వ సంవత్సరం వరకు జనరల్ క్యాటగిరీ కాగా, 1967 నుంచి ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 12 సార్లు జరిగిన ఎన్నికల్లో రాజనర్సింహ కుటుంబ సభ్యులే ఆరుసార్లు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, టీడీపీల మధ్యే పోటీ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీల మధ్యే ఎక్కువసార్లు పోటీ జరిగింది. 1967, 1972, 1978లో స్వతంత్ర, జనతాపార్టీ అభ్యు›ర్థులు పోటీలో ఉండగా, 1983 నుంచి 2009 వరకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. 2014వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ తరఫున బాబూమోహన్ పోటీ చేసి గెలుపొందారు. నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థి, నాలుగు సార్లు టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు మాజీ మంత్రి గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి జనతాపార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జోగిపేట ఎమ్మెల్యేలు బస్వమాణయ్య, లక్ష్మారెడ్డి 1952లో ఏర్పడిన నియోజకవర్గంలో ఒక్కసారి మాత్రమే జోగిపేటకు చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఓపెన్ క్యాటగిరీ ఉన్న సమయంలో వైశ్యుడైన బస్వమాణయ్య 1957వ సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జోగిపేటకు చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భాలు లేవు. 1967 నుంచి రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడడంతో ఇక్కడ పోటీ చేసే అవకాశం లేకపోవడంతో జోగిపేట పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శేరి లక్ష్మారెడ్డి మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రిజర్వుడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ప్రధాన పార్టీలు స్థానికులకు అవకాశం కల్పించలేదు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజనర్సింహ అందోల్ రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లోనే రాజనర్సింహ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సికింద్రాబాద్‌లో కార్పొరేటర్‌గా ఉన్న రాజనర్సింహను కాంగ్రెస్ పార్టీ అందోల్‌లో పోటీ చేయించింది. 1967, 1972, 1978లలో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1983లో స్థానిక రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాజనర్సింహకు కాకుండా సంగారెడ్డికి చెందిన హెచ్.లక్ష్మణ్‌జీకి ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా రాజనర్సింహ ఓటమి చెందారు. ఇదే సంవత్సరంలో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఎన్నికైన లక్ష్మణ్‌జీ 1983లో ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి పట్టణానికి చెందిన హట్కర్ లక్ష్మణ్ జీ గెలుపొందడం సంచలనం కలిగించింది. అప్పట్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అందోల్‌లో టీడీపీ తరఫున పటాన్‌చెరుకు చెందిన డాక్టర్ యాదయ్య ఓటమి చెందారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా లక్ష్మణ్ గెలుపొంది ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రజల జీవన స్థితిగతులు ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం. 80 శాతానికి పైగా వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగాలపై జీవిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని పుల్కల్ మండలం సింగూరులో ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా అందోలు, పుల్కల్ మండలాలకు 40వేల ఎకరాలకు సాగునీరును అందిస్తారు. కేవలం హైద్రాబాద్ జంట నగరాలకు త్రాగునీటిని, నిజాంసాగర్, ఘనపూర్ ఆయకట్టుకు సేద్యానికి నీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అయితే 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సీఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కాలువల నిర్మాణం, భూసేకరణకు రూ.89.98 కోట్లు మంజూరు చేసి స్వయంగా పనులకు శంకుస్థాపన చేసారు. ఆ కళ 2016–17 సంవత్సరంలో సాకారమైంది. నియోజకవర్గంలో పెద్దగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్లాల్సిన పరిస్థితి. ‘అందోల్’ రెడ్డిరాజుల కోట జోగిపేట(అందోల్): మెతుకు రాష్ట్రానికి అందోల్ ముఖ్య పట్టణంగా ఉండేది. రెడ్డిరాజుల కాలంలో శంకరమ్మ, సదాశివరెడ్డి, అల్లమరెడ్డి, సూర్యప్రతాపరెడ్డిలు పరిపాలించేవారు. వీరి రాజ్యంపై నిజాం దండయాత్రకు వచ్చినప్పుడు కప్పం కడతాం అన్న ఒప్పందాన్ని వారితో కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో రెడ్డిరాజులే స్వతంత్రంగా పరిపాలించుకునేందుకు వీలు కలిగింది. అప్పట్లో అందోలులో మూడు గౌనిలు, 36 బురుజులు, ఆరు చిన్న దొడ్డీలు, ఒక సొరంగమార్గం నిర్మించుకున్నారు. రెడ్డి రాజులు కలబ్‌గూరులో కాశీ విశ్వనాథ ఆలయం, అందోల్‌లో రంగనాథ ఆలయం, రంగంపేటలోనూ రంగనాథ ఆలయాలను నిర్మించి ఆస్థానాలు ఏర్పరచుకున్నారు. అందోల్‌లో ఇప్పటికి బురుజులు చెక్కు చెదరలేదు. శత్రువులను ఎదుర్కొనేందుకు వీలుగా కోటల నిర్మాణం చేపట్టారు. అప్పట్లో రెడ్డిరాజుల వంశీయురాలైన శంకరమ్మకు శార్దూలం అనే బిరుదు కూడా అప్పట్లో నామకరణం చేశారు. మంజీర నది పరివాహక ప్రాంతం ఒడ్డున రెడ్డి రాజులు విహర యాత్రకు వెళుతున్న సమయంలో ఆ ప్రదేశం నచ్చి అక్కడే ఉండి పోవడానికి నిశ్చయించుకొని ‘అందోల్’ నుంచే తన పరిపాలనను సాగించారు. -
మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ పర్యటన
కోటగుమ్మం(రాజమండ్రి): విభాజ్య ఆంధ్రప్రదేశ్ చివరి ఉప ముఖ్యమంత్రి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రూపకర్త సి. దామోదర రాజనరసింహ జిల్లాలో పర్యటించారు. శనివారం ఉదయం రాజమండ్రికి చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, నగర అధ్యక్షులు ఎన్.వి. శ్రీనివాస్, దళిత నాయకులు తాళ్ళూరి విజయ్ కుమార్ ఆయన కు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన గోకవరం బస్టాండ్ వద్దగల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయం సందర్శించి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ నాయకులు తాళ్లూరి బాబూ రాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి, కొమరాపు మనోజ్ తదితరులు పాల్గొన్నారు.