కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు | Outsourcing jobs to Congress workers: Damodara Rajanarsimha | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు

Published Mon, Apr 8 2024 1:25 AM | Last Updated on Mon, Apr 8 2024 1:25 AM

Outsourcing jobs to Congress workers: Damodara Rajanarsimha - Sakshi

మంత్రి దామోదర రాజనర్సింహ హామీ

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఔట్‌సో ర్సింగ్‌ ఉద్యోగాలలో కాంగ్రెస్‌ కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నర్సింహ హామీ ఇచ్చారు. బాన్సువాడలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చారన్నారు. ప్రస్తుతం అన్ని కులాలకు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కిందన్నారు.  పార్లమెంట్‌ ఎన్నికల్లో జహీరాబాద్‌ ఎంపీగా కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్, డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement