
దుబాయ్: హ్యాట్రిక్ పరాజయాలతో ఇప్పటికే టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌కు మరో దెబ్బ. తొడ కండరాల గాయంతో ఆ జట్టు ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ మెగా టోర్నీ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. గత శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. అనంతరం అతడిని 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యుల బృందం షకీబ్ కోలుకోవడానికి మరికొంత సమయం అవసరమని తెలిపింది. దాంతో బంగ్లాదేశ్ ఆడే తదుపరి మ్యాచ్‌ల్లో అతడు బరిలోకి దిగడం లేదు.