
జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. టోక్యోలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–15, 20–22తో ఆరో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు.
80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకదశలో ప్రణయ్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. ముఖాముఖిగా ఇప్పటివరకు చౌ తియెన్ చెన్, ప్రణయ్ ఎనిమిదిసార్లు తలపడగా... ఐదుసార్లు చౌ తియెన్ చెన్, మూడుసార్లు ప్రణయ్ గెలిచారు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్‌కు 4,125 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 28 వేలు)తోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment