న్యూఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఈ ఏడాది కలిసి రావడంలేదు. 2023లో సింధు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోగా, మాడ్రిడ్ మాస్టర్స్ టోరీ్నలో రన్నరప్‌గా నిలవడం ఆమె అత్యుత్తమ ప్రదర్శన. తాజాగా యూఎస్ ఓపెన్‌లో సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది. దాంతో ఆమె తీవ్ర నిరాశ చెందింది. ఈ ఓటమి అనంతరం సోషల్ మీడియాలో స్పందించింది. ఆశ్చర్యకరంగా గతంలో ఎన్నడూలేని రీతిలో తన భావోద్వేగాలను ప్రదర్శించింది.
‘ఈ ఓటమి మానసికంగా నాపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా అన్ని ప్రతికూలతలు ఎదురవుతున్న ఈ ఏడాదిలో ఇలాంటి ఫలితం రావడం బాగా నిరాశపర్చింది. తాజా పరాజయంతో నేను చాలా బాధపడ్డాను. నా ఈ భావోద్వేగాలను సరైన రీతిలో మలచుకొని నా ఆట ను మరింత మెరుగుపర్చుకొనేందుకు, ఎక్కువగా సాధన చేసేందుకు వాడుకుంటా. రాబోయే కొరియా, జపాన్ టోరీ్నల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మీ అభిమానమే నాకు సర్వస్వం. దానికి కృతజ్ఞురాలిని’ అని సింధు పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment