
తొలి సినిమా కావడంతో రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్‌లో పాల్గొంటున్నారు కథానాయిక అనన్యా పాండే. కానీ బ్యాడ్‌లక్. సెట్‌లో ఆమెకు స్మాల్ యాక్సిడెంట్ అయ్యిందట. అయితే ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్నారు. ఆరేళ్ల క్రితం విడుదలైన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రానికి సీక్వెల్‌గా పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్, అనన్యా పాండే, తారా సుతారియా ముఖ్య పాత్రలుగా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రం రూపొందుతోంది.
ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. టైగర్ ష్రాఫ్, అనన్యా పాండే, తారా సుతారియాలపై హై స్కూల్‌నాటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓ సీన్‌లో భాగంగా అనన్యా కారు డ్రైవ్ చేశారు. ఆ సమయంలో కారు కంట్రోల్ తప్పి చెట్టును ఢీ కొట్టింది. అదృష్టవశాత్తు చిత్రబృందం ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏ ప్రమాదం జరగలేదు. దాంతో రిలీఫ్ అయ్యారట. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నార
Comments
Please login to add a commentAdd a comment