
బాలీవుడ్ నటుడు చుంకీ పాండే- భావనా పాండే వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అనన్యా పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి. తల్లిదండ్రులతో కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోలను షేర్ చేసిన అనన్య..‘మొదటి పెళ్లిరోజు నుంచి నుంచి మీతోనే ఉన్నాను. మీ ఇద్దరికీ 21వ వివాహ వార్షిక శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ జతచేశారు. ఈ క్రమంలో... ‘ అవును... మీ ముగ్గురు నా జీవితంలో ఉండటం వల్లే నేను అదృష్టవంతుడిని అయ్యాను’ అని చుంకీ పాండే.. తన గారాల పట్టి విషెస్‌కు బదులిచ్చారు.
కాగా బాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చుంకీ పాండే 1998లో భావనను పెళ్లాడాడు. వీరికి అనన్య, రీసా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె అనన్య ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. 2012లో విడుదలైన సూపర్‌హిట్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన ఓ హీరోయిన్‌గా అనన్య నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment