
అనన్యా పాండే
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు అనన్యా పాండే. 2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాకు ఇది సీక్వెల్. పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ హీరో. తారా సుతారియా ఈ సినిమాలో మరో హీరోయిన్. ‘‘మీ తొలి సినిమాలోనే ఇంకో హీరోయిన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పోటీగా ఫీల్ అయ్యారా? అని అనన్యా పాండేని అడిగితే... ‘‘నాకు ఎటువంటి అభద్రతాభావం లేదు. కథ నచ్చితే నాతోపాటు పదిమంది హీరోయిన్లు స్క్రీన్ షేర్ చేసుకున్నా నాకేం ప్రాబ్లమ్ లేదు. పైగా నా స్ట్రెస్ ఫీలింగ్ కూడా తగ్గుతుంది. సినిమాలో అంతమంది ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. ‘స్టూ్టడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రం ఈ నెలలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment