
ఆమెను 40 లక్షలమంది అనుసరిస్తున్నారు
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ భామ అలియాభట్కు ఫిదా అయిపోయేవాళ్లు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఆమె అభిమానుల సంఖ్య 40 లక్షలు దాటేసింది. 22 ఏళ్ల ఈ చిన్నది స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం ద్వారా ఒక్కసారిగా యువ హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ అమ్మడు షాందార్, ఉథా పంజాబ్, కపూర్ అండ్ సన్స్ అనే చిత్రాల ద్వారా వెంటవెంటనే తన అభిమానులను పలకరించబోతోంది.
అయితే, సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఆమెను ఫాలో అయ్యేవారు దాదాపుగా 4.19 మిలియన్లకు చేరడంతో తెగ మురిసిపోతోంది అలియా భట్. అభిమానులారా మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. సినిమాలు, పాటలు, జోకుల ద్వారా ఎలా వీలయితే అలా మీ అందరిని అలరింపజేస్తానని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను' అంటూ వాగ్దానం చేసింది.