బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ (ఫైల్ ఫొటో)
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి, సీనియర్ నటుడు రిషీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన ట్వీట్ రణ్‌బీర్ - అలియా అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. ‘ఎంతో ప్రతిభావంతులైన భట్ కుటుంబ సభ్యులందరితో కలిసి పనిచేశాను. మహేష్ భట్, ముఖేష్ భట్, రాబిన్, పూర్ణిమా, సోనీ, ఇమ్రాన్ హష్మీ, అలియా భట్ మీ అందరికీ కృతఙ్ఞతలంటూ’ ఆయన ట్వీట్ చేశారు.
కపూర్ అండ్ సన్స్ సినిమాలో రిషి కపూర్‌తో కలిసి నటించిన అలియా.. ‘మనం మరోసారి కలిసి నటిస్తామని నేను ఆశిస్తున్నాను. కుదిరితే ఈసారి అందరం కలిసి..’ అంటూ ట్వీట్ చేశారు. అయితే బ్రహ్మాస్త్ర సినిమాలో నటించిన సమయంలో రణ్‌బీర్ కపూర్- అలియా భట్ ప్రేమలో పడ్డారని వదంతులు ప్రచారం అయ్యాయి. సోనమ్ కపూర్ పెళ్లికి వీరిద్దరూ జంటగా హాజరవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. పలు సందర్భాల్లో రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ కూడా అలియాపై తనకు ఉన్న ఇష్టాన్ని తెలపడం.. ఇప్పుడు రిషీ కపూర్ కూడా భట్ ఫ్యామిలీని పొగడడం చూస్తుంటే.. ఈ కపూర్ ఫ్యామిలీ మొత్తం అలియాకు ఫిదా అయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Have worked with most of the talented Bhatt family(and relatives). Mahesh Bhatt,Mukesh Bhatt,Robin Bhatt,Purnima ji, Soni Bhatt, Pooja Bhatt, Emran Hashmi, Alia Bhatt. Thank you all!
— Rishi Kapoor (@chintskap) May 22, 2018
Haha wow 😀🌟🙌 hope we work together again sir.. maybe this time all together 😬😬 https://t.co/hJmlM24qRr
— Alia Bhatt (@aliaa08) May 22, 2018
Comments
Please login to add a commentAdd a comment