పెళ్లైన ఇన్నాళ్లకు, ఇంటిపేరు మార్చుకున్న అలియా | Alia Bhatt reveals she officially changed her surname after wedding with Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

పెళ్లైన ఇన్నాళ్లకు, ఇంటిపేరు మార్చుకున్న అలియా

Published Tue, Sep 17 2024 11:53 AM | Last Updated on Tue, Sep 17 2024 2:29 PM

Alia Bhatt reveals she officially changed her surname after wedding with Ranbir Kapoor

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్  పెళ్లి అయిన ఇన్నాళ్లకి తన ఇంటి పేరును మార్చుకుంది.   స్టార్‌ హీరో రణ్‌బీర్ కపూర్‌తో వివాహం తర్వాత తన ఇంటిపేరును మార్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో  ఇటీవల అలియా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. జిగ్రా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె తన పేరు పక్కన ‘కపూర్‌’ను చేర్చుకున్నట్లు తెలిపింది. అంతేకాదు జిగ్రా టైటిల్స్‌ లో కూడా తన పేరు అలానే ఉంటుందని గందరగోళం వద్దని కూడా క్లారిటీ ఇచ్చింది. 

ప్రమోషన్స్‌ భాగంగా శనివారం ‘‘గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్-2’’ లో జిగ్రా టీమ్‌తో పాల్గొంది. ఈ సమయంలో ఒక అభిమాని హాయ్ అలియా భట్  అని సంబోధించగా,  ‘‘నేనిపుడు అలియా భట్ కపూర్‌  అంటూ స్పందించింది అలియా దీంతో అభిమానులలో ఆనందం , ఆశ్చర్యం రెండింటినీ రేకెత్తించింది. మన భారత దేశంలో ప్రాంతాలను బట్టి, వివాహం జరిగిన తరువాత భార్యకు భర్త ఇంటి పేరు వర్తిస్తుంది.  ఇంటి పేరు మార్చుకోవాలా? వద్దా? అనేది ఇది వారి వారి ఇష్టాయిష్టాలను బట్టి  ఉంటుంది. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)

కాగా  చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం  అయిన అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది.  ఆ తరువాత  2022లో బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గంగూబాయి కతియావాడి, బ్రహ్మాస్త్రం, సడక్-2 లాంటి టాప్‌ మూవీలతోపాటు  తెలుగులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో భారీ క్రేజ్‌ సంపాదించుకుంది. రణ్‌బీర్‌, అలియాకు రాహా  అనే కూతురు ఉంది.  వాసన్ బాలా దర్శకత్వంలో అలియా నటించిన లేటెస్ట్‌ మూవీ జిగ్రా అక్టోబర్ 11న థియేటర్స్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement