Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్‌ | Anant-Radhika Pre Wedding celebs spotted at the airport as they fly to Italy | Sakshi
Sakshi News home page

Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్‌

Published Mon, May 27 2024 12:08 PM | Last Updated on Mon, May 27 2024 6:53 PM

 Anant-Radhika Pre Wedding celebs spotted at the airport as they fly to Italy

ఆసియా బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్‌  అంబానీ -రాధికా మర్చంట్‌ల పెళ్లి ముచ్చట మరోసారి వార్తల్లో నిలుస్తోంది.  ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌  పూర్తి చేసుకుని, ప్రీ వెడ్డింగ్‌ బాష్‌ను ఘనంగా నిర్వహించుకున్న లవ్‌బర్డ్స్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు.  

ఛలో ఇటలీ..
ఈ ఏడాది మార్చిలో జామ్‌నగర్‌లో వారి గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల తర్వాత, అనంత్ -రాధిక మర్చంట్ ఇటలీ నుండి ఫ్రాన్స్‌కు ప్రయాణించే క్రూజ్‌లో మూడు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా మరో ప్రీ వెడ్డింగ్‌ వేడుకను  నిర్వహించుకునేందుకు రడీగా ఉన్నారు.  ఈ వేడుక కోసం బాలీవుడ్‌,  క్రీడా, రాజకీయ రంగ ప్రముఖులు  ఇటలీకి పయనమయ్యారు. ముఖ్యంగా ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీతోపాటు,అనిల్‌ అంబానీ ,  కాబోయే వధువు రాధిక తండ్రితో కలిసి వెళ్లారు.   ( ఇదీ చదవండి: అనంత్‌ - రాధిక ప్రీవెడ్డింగ్‌ బాష్‌ : 800 మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?)

అలాగే రాధిక-అనంత్‌కు మంచి స్నేహితులు  బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ అలియా భట్, రణబీర్ కపూర్ తన ముద్దుల తనయ రాహాలతో కలిసి బయలుదేరారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. అలాగే  ప్రముఖ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ భార్య సాక్షి, పాపతో  కలిసి ఎయిర్‌ పోర్ట్‌లో దర్శనిచ్చారు. అంతేనా సల్మాన్‌ ఖాన్‌, రణవీర్‌ సింగ్‌ ఇంకా బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. (చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్‌ గిఫ్ట్‌ : రూ.640 కోట్ల దుబాయ్‌ లగ్జరీ విల్లా)

కాగా అనంత్-రాధిక  రెండవ ప్రీ వెడ్డింగ్ బాష్ మే 28వ తేదీనుంచి  30 మధ్య దక్షిణ ఫ్రాన్స్ తీరంలో క్రూయిజ్ షిప్‌లో జరుగుతందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి, 2365 నాటికల్ మైళ్లు (4380 కిమీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్న వేదికకు చేరుకుంటుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement