అనంత్‌ - రాధిక ప్రీవెడ్డింగ్‌ బాష్‌ : 800 మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా? | Anant Ambani Radhika Merchant Second Pre Wedding bash 800 Guests To Join | Sakshi
Sakshi News home page

అనంత్‌ - రాధిక ప్రీవెడ్డింగ్‌ బాష్‌ : 800 మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?

Published Tue, May 14 2024 5:20 PM | Last Updated on Tue, May 14 2024 7:07 PM

 Anant Ambani Radhika Merchant Second Pre Wedding bash 800 Guests To Join

ఆసియా కుబేరుడు రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ,  నీతా అంబానీ దంపతుల  చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ తన లేడీ లవ్‌ రాధిక మర్చంట్‌ మెడలో మూడు ముళ్లు వేసేందుకు సన్నద్ధమవున్నాడు. వచ్చే నెల (జూలై 12న) అనంత్‌-రాధిక వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించేందుకు అంబానీ సిద్ధమ వుతున్నారు. ఈ క్రమంలో మార్చి మూడవ తేదీవరకు జామ్‌నగర్‌లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకుల సందడి ఇంకా ముగియకముందే రెండో ప్రీ వెడ్డింగ్‌ వేడుకకు సన్నద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 28 నుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్‌లో క్రూయిజ్‌ షిప్‌లో  రెండో  ప్రీ-వెడ్డింగ్ వేడుక జరగనుంది. 

క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి 2365 నాటికల్ మైళ్ల (4380 కి.మీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్‌లోని  గమ్యస్థానానికి చేరుకుంటుందని కూడా పేర్కొంది. ఈ వేడుక కేవలం పెళ్లి చేసుకోబోయే అనంత్‌-రాధికకు మాత్రమేకాదు అతిథులందరికీ కూడా అద్భుతమైన అనుభవంగా మిగలేలా సర్వ హంగులతో ఏర్పాట్లు చేస్తున్నాయిట ఇరు కుటుంబాలు. 

అతిధులు 
ఈ వేడుకలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్‌ సెలబ్రిటీలతో సహా మొత్తం 800 మంది అతిథులు హాజరుకానున్నారు. రముఖ్యంగా అనంత్‌ సోదరుడు ఆకాష్ అంబానీ శ్లోకా మెహతా జంటతో సన్నిహితంగా ఉంటే బాలీవుడ్‌ జంట రణబీర్ కపూర్ అలియా భట్  స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవబోతున్నారు.  క్రూయిజ్ షిప్‌లో మొత్తం 600 మంది సిబ్బంది  అతిథుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారట. 

కాగా 2017లో డ్రైవ్‌లో పరస్పర స్నేహితుల ద్వారా పరిచయమైన వీరిద్దరూ లవ్‌బర్డ్స్‌గా మారిపోయారు. కొన్నాళ్ల డేటింగ్‌ తరువాత 2023లో రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ టెంపుల్‌లో రాధికకు పెళ్లికి ప్రపోజ్ చేశాడు. ఆ  తర్వాత ఆంటిలియాలో నిశ్చితార్థం వేడుక, 2024లో జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్‌ హస్తాక్షర్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement