టైగర్‌తో ఆ సన్నివేశంపై అనన్య రియాక్షన్‌.. | Ananya Pandey Opens Up About Her Kissing Scene With Tiger Shroff | Sakshi
Sakshi News home page

టైగర్‌తో ఆ సన్నివేశంపై అనన్య రియాక్షన్‌..

Published Sun, May 5 2019 12:35 PM | Last Updated on Sun, May 5 2019 12:35 PM

Ananya Pandey Opens Up About Her Kissing Scene With Tiger Shroff - Sakshi

టైగర్‌తో ఆ సన్నివేశంపై స్పందించిన అనన్య

ముంబై : స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ టూతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఇదే మూవీలో హీరో టైగర్‌ ష్రాఫ్‌తో ముద్దు సన్నివేశంపై స్పందించారు. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో మాట్లాడిన అనన్య తాను వేరొకరికి ముద్దు పెట్టడం ఇదే తొలిసారని, సో దీన్ని మరో కిస్‌తో పోల్చలేనని, అయితే తన తొలి బెస్ట్‌ కిస్‌ ఇదేనని చెప్పారు.

కరణ్‌ జోహార్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌కు సీక్వెల్‌గా స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ టూ తెరకెక్కింది. ఒరిజినల్‌లో అలియా భట్‌, వరుణ్‌ ధావన్‌, సిద్ధార్ధ్‌ మల్హోత్రాలను కరణ్‌ జోహార్‌ బాలీవుడ్‌కు పరిచయం చేశారు. మరోవైపు సీక్వెల్‌లో టైగర్‌ ష్రాఫ్‌తో అలియా భట్‌ ఓ పాటలో ఆడిపాడారు. కరణ్‌ జోహార్‌ నిర్మాణ సారథ్యంలో ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ టూను పునీత్‌ మల్హోత్రా తెరకెక్కించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement