ఏడాది పాటు క్లాసులను పూర్తి చేశారు హీరోయిన్ అనన్యా పాండే. ఎవరీ అమ్మాయి అని ఆలోచిస్తున్నారా? అయితే చదవండి. బాలీవుడ్‌లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాలో ఒక కథానాయికగా నటించారు అనన్యా పాండే. ఈ సినిమా స్టార్ట్ చేసి గత మంగళవారంతో సరిగ్గా ఏడాది ముగిసింది. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు అనన్య. ‘‘మా సినిమా స్టార్ట్ చేసి సరిగ్గా ఏడాది అయ్యింది. ఏడాదిగా కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉన్నాను.
సెట్‌లో ప్రతిరోజూ ఏదో ఒక మ్యాజిక్ జరిగిందనిపిస్తోంది. సినిమా రిలీజ్‌కు దగ్గరపడుతోంది. చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు అనన్య. పుణీత్ మల్హోత్రా దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్, తారా సుతారియా, అనన్యా పాండే ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’. కరణ్ జోహర్ నిర్మించారు. 2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రానికి ఇది సీక్వెల్. మే 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. మూడో భాగాన్ని కూడా చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment