ధడక్ మూవీ స్టిల్
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ కరణ్ జోహార్ నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘ధడక్’. మరాఠీ మూవీ ‘సైరట్’కు అధికారిక రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ నటనను చూసిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. శుక్రవారం(జూలై 20) విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా రికార్డు సృష్టించి జాన్వీ సంతోషాన్ని రెట్టింపు చేసింది. విడుదలైన రోజే 8. 71 కోట్ల రూపాయలు వసూలు చేయడం ద్వారా.. నూతన తారలతో రూపొంది, తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఘనత సాధించింది. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు.
‘ధడక్‌కు గొప్ప ఆరంభం.. నూతన తారలతో రూపొందినప్పటికీ తొలిరోజే 8.71 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ పేరిట ఉన్న రూ. 8 కోట్ల రికార్డును అధిగమించిందంటూ’ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కాగా ఈ రెండు సినిమాలు కరణ్ జోహారే నిర్మించారు. ‘ధడక్’ సినిమాలో జాన్వీకి జోడీగా షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ నటించాడు. ‘బియాండ్ ద క్లౌడ్స్’ సినిమాలో సహాయక పాత్రలో నటించిన ఇషాన్‌కు హీరోగా మాత్రం ఇదే తొలి చిత్రం.
#Dhadak takes a HEROIC START... Rarely does a film starring absolute newcomers open so well... Day 1 is higher than #StudentOfTheYear [₹ 8 cr]… Fri ₹ 8.71 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) July 21, 2018
Comments
Please login to add a commentAdd a comment