ధడక్ మూవీ ఫైల్ ఫోటో
అతిలోక సుందరి, అలనాటి అందాల తార శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్, సినీ కెరీర్‌లోకి ఎంట్రీ ఇస్తూ తీసిన మూవీ ధడక్ విడుదలైంది. జాతీయ అవార్డు అందుకున్న సైరత్ మూవీకి రిమేక్‌గా ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోని స్క్రీన్లపైకి వచ్చేసింది. బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సౌందర్యరాశి కలలు నిజమయ్యాయి. తొలి మూవీలోనే జాహ్నవి అద్భుతంగా నటించి, తల్లికి నటనలోనూ వారసురాలినని నిరూపించుకుంది. ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచి, ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న జాన్వీ కపూర్ పొందిన పారితోషికం ఎంత? అనేది ప్రస్తుతం ఆసక్తిదాయకమైన అంశంగా నిలిచింది. ఈ వివరాలను సైతం డైలీహంట్ రిపోర్టు చేసింది. ధడక్ సినిమాకు గాను, జాన్వీ కపూర్ అరవై లక్షల రూపాయల పారితోషికం అందుకున్నట్టు తెలిపింది. తన తొలి సినిమాకు ఈ మేరకు పారితోషికం పొందిందని తెలిసింది.
అలాగే ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయిన ఇషాన్ ఖట్టర్‌కు కూడా అరవై లక్షల రూపాయల పారితోషికమే ఇచ్చారట. అయితే వీరిద్దరి కంటే అధికంగా జాన్వీ తండ్రిగా ఈ సినిమాలో నటించిన అశుతోష్ రాణాకు రూ.80 లక్షలకు చెల్లించారని.. సైరత్, ధడక్ రెండింటికీ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉన్న అజయ్-అతుల్‌లకు రూ.1.5 కోట్ల పారితోషికం ఇచ్చారని తెలిసింది. ధడక్ చిత్రానికి మ్యూజిక్ ఓ మ్యాజిక్ అని క్రిటిక్స్ సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా రీరికార్డింగ్ సినిమాను నిలబెట్టిందని, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసిందని అంటున్నారు. ఫీల్‌గుడ్, ఎమోషనల్ ఫ్యాక్టర్‌ను అందించడంలో అజయ్, అతుల్ సంగీతద్వయం ఆకట్టుకున్నదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment