బూసాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హారామీ | Emraan Hashmi starrer Harami selected in Busan Film Festival | Sakshi
Sakshi News home page

బూసాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హారామీ

Sep 15 2020 3:15 AM | Updated on Sep 15 2020 3:15 AM

Emraan Hashmi starrer Harami selected in Busan Film Festival - Sakshi

ఇమ్రాన్‌ హష్మి

ఇమ్రాన్‌ హష్మి నటించిన లేటెస్ట్‌ హిందీ చిత్రం ‘హారామీ’కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఈ ఏడాది జరగనున్న బూసాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘హారామీ’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఇండో – అమెరికన్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్యామ్‌ మదిరాజ్‌ దర్శకత్వం వహించారు. ముంబై వీధుల్లో జరిగే క్రైమ్‌ కథా చిత్రమిది. రెండేళ్ల పాటు ఈ సినిమాను చిత్రీకరించారు. ‘మా టీమ్‌ అందరి శ్రమ వల్ల బూసాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి మా సినిమా ఎంపికైందని అనుకుంటున్నాను. ఇండియన్‌ ఆడియన్స్‌కు ఈ సినిమా ఎప్పుడు చూపిస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు ఇమ్రాన్‌ హష్మి. అక్టోబర్‌ 21 నుంచి 30 వరకూ బూసాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement