ఆ నిబంధన పెట్టుకున్నా! | Emraan Hashmi gets candid about including a harassment clause in his contracts | Sakshi
Sakshi News home page

ఆ నిబంధన పెట్టుకున్నా!

Published Fri, Oct 12 2018 2:26 AM | Last Updated on Fri, Oct 12 2018 2:26 AM

Emraan Hashmi gets candid about including a harassment clause in his contracts - Sakshi

ఇమ్రాన్‌ హష్మి

‘మర్డర్, జన్నత్, గ్యాంగ్‌స్టర్, మిస్టర్‌ ఎక్స్, బాద్‌షాహో’ వంటి హిందీ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు ఇమ్రాన్‌ హష్మి. రీసెంట్‌గా ‘చీట్‌ ఇండియా’ సినిమాతో నిర్మాతగానూ మారారాయన. వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్న ఈ సినిమాలో హీరోగానూ నటిస్తున్నారు ఇమ్రాన్‌. ప్రస్తుతం మహిళలపై లైగింక వేధింపులకు సంబంధించిన ‘మీటూ’ ఉద్యమం గురించి ఎంత చర్చ జరుగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఈ ఉద్యమానికి సంబంధించి ఇకపై తాను నటించబోయే సినిమా కాంట్రాక్ట్స్‌లో ‘యాంటీ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌’ క్లాజ్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటానని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. ‘‘ఇతర రంగాలకు చెందిన పలు కంపెనీల్లో ఇలాంటి క్లాజ్‌ ఉంది. మల్టీనేషనల్‌ కంపెనీలు కూడా ఈ క్లాజ్‌ను పరిశీలనలోకి తీసుకుంటున్నాయి. కానీ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌లో సరిగ్గా అమలు కావడం లేదు. నా కంపెనీలో స్త్రీలు, పురుషులకు ఈ నిబంధన వర్తించేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మీ టూ’ ఉద్యమంలో నా పేరు వస్తుందనుకోవడం లేదు. ఎందుకంటే నేనేప్పుడూ డైరెక్టర్స్‌ చెప్పిన వాటిని మాత్రమే చేశాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement