clause
-
ఆ నిబంధన పెట్టుకున్నా!
‘మర్డర్, జన్నత్, గ్యాంగ్‌స్టర్, మిస్టర్ ఎక్స్, బాద్షాహో’ వంటి హిందీ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు ఇమ్రాన్ హష్మి. రీసెంట్గా ‘చీట్ ఇండియా’ సినిమాతో నిర్మాతగానూ మారారాయన. వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్న ఈ సినిమాలో హీరోగానూ నటిస్తున్నారు ఇమ్రాన్. ప్రస్తుతం మహిళలపై లైగింక వేధింపులకు సంబంధించిన ‘మీటూ’ ఉద్యమం గురించి ఎంత చర్చ జరుగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఉద్యమానికి సంబంధించి ఇకపై తాను నటించబోయే సినిమా కాంట్రాక్ట్స్‌లో ‘యాంటీ సెక్సువల్ హెరాస్మెంట్’ క్లాజ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటానని ఇమ్రాన్ పేర్కొన్నారు. ‘‘ఇతర రంగాలకు చెందిన పలు కంపెనీల్లో ఇలాంటి క్లాజ్ ఉంది. మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఈ క్లాజ్‌ను పరిశీలనలోకి తీసుకుంటున్నాయి. కానీ ఫిల్మ్ ప్రొడక్షన్లో సరిగ్గా అమలు కావడం లేదు. నా కంపెనీలో స్త్రీలు, పురుషులకు ఈ నిబంధన వర్తించేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మీ టూ’ ఉద్యమంలో నా పేరు వస్తుందనుకోవడం లేదు. ఎందుకంటే నేనేప్పుడూ డైరెక్టర్స్ చెప్పిన వాటిని మాత్రమే చేశాను’’ అన్నారు. -
రాంగ్ రూట్
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. కొత్త మోడళ్లకుఅనుగుణంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వాల్సిన డ్రైవింగ్ స్కూళ్లుదారితప్పుతున్నాయి. భారీగా ఫీజులు వసూలు చేస్తూ పాతవాహనాల్లో శిక్షణ ఇస్తున్నాయి.శిక్షణ కోసం అనుమతితీసుకునేది ఒక్కదానికే..బ్రాంచ్‌ల పేరుతో ఇష్టారాజ్యంగా కేంద్రాలను పెంచుకుంటూ నిబంధనలకు తూట్లు పొడుస్తూ రాంగ్రూట్లో పయనిస్తున్నాయి. ఈ స్కూళ్లనుపర్యవేక్షించాల్సిన అధికారులు కన్పించరు. పదేళ్లుగా డ్రైవింగ్ స్కూళ్లపై ఒక్కటంటే ఒక్క కేసు నమోదు కాలేదంటే అధికారుల పనితీరుఅవగతమవుతుంది. నెల్లూరు (టౌన్): అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో డ్రైవింగ్ నేర్పాలన్న ప్రభుత్వ లక్ష్యం పక్కదారిపట్టింది. పదుల సంఖ్యలో డ్రైవింగ్ స్కూళ్లకు అనుమతి పొందుతూ కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బ్రాంచిల పేరుతో ఎక్కడపడితే అక్కడ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 18 స్కూళ్లకు మాత్రమే అనుమతి ఉంది. అనుమతిలేని స్కూళ్లు 50కి పైగానే ఉన్నాయి. నెల్లూరు నగరంలో 11, గూడూరులో 2, ఆత్మకూరులో 2, సూళ్లూరుపేటలో 2, కావలిలో 1 డ్రైవింగ్స్కూల్కు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. పాత వాహనాల్లోనే శిక్షణ మార్కెట్లోకి ఆధునిక టెక్నాలజీతో కొత్త వాహనాలు వస్తున్నా, డ్రైవింగ్ స్కూళ్ల యాజమాన్యం మాత్రం పాత వాహనాలనే డ్రైవింగ్ శిక్షణకు వినియోగిస్తున్నాయి. ఎన్నోఏళ్ల క్రితం మార్కెట్లోకి వచ్చిన అంబాసిడర్, మారుతి 800 కార్లలోనే శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు అసలు ఉండవు. పేరుకే డ్రైవింగ్ స్కూల్. అక్కడ శిక్షణ ఇచ్చే ఇన్స్ట్రక్టర్ ఉండరు. డెమో క్లాసులు నిర్వహించేందుకు ప్రత్యేక తరగతి ఉండదు. కారు విడి విభాగాలు అసలు ఉండవు. మొక్కుబడి శిక్షణతో మమ అనిపిస్తున్నారు. నిబంధనలు బేఖాతర్ జిల్లాలో డ్రైవింగ్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తున్నాయి. శిక్షకులుగా కేవలం లైసెన్స్ ఉన్న వ్యక్తిని మాత్రమే నియమిస్తున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు కనిపించరు. అనుభం ఉన్న వారి సంఖ్య కూడా తక్కువే. డ్రైవింగ్‌లో శిక్షణ కేవలం 15 రోజుల పాటు, రోజుకు ఒక గంట మాత్రమే నేర్పిస్తున్నారు. నేర్చుకునేందుకు వచ్చిన తొలిరోజు నుంచే వారికి స్టీరింగ్ పట్టిస్తున్నారు. డ్రైవింగ్ నేర్పించినందుకు ఒక్కొక్కొరి నుంచి స్కూల్‌ను బట్టి రూ. 5వేల నుంచి రూ.8వేలకు వసూలు చేస్తున్నారు. లైసెన్స్ కూడా ఇప్పించినట్లయితే అదనంగా మరో రూ.3వేలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఫీజలు పట్టిక ఏ డ్రైవింగ్ స్కూల్లో కనిపించదు. తనిఖీలు నిల్ డ్రైవింగ్ స్కూళ్లపై ఎక్కడా తనిఖీలు కనిపించవు. పదేళ్ల క్రితం నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. డ్రైవింగ్ స్కూల్స్ యాజమాన్యం ఇచ్చే మామూళ్లతో అధికారులు తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని వాహనాలకు ఇన్సూ్యరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే డ్రైవింగ్ శిక్షణకు వినియోగిస్తున్నారు. ఇన్సూ్యరెన్స్, ఫిట్నెస్ లేని వాహనాలు ప్రమాదానికి గురైతే బాధితులకు ఒక్క రూపాయి కూడా రాదు. ఇప్పటికైనా రవాణా అధికారులు జిల్లాలో ఉన్న డ్రైవింగ్ స్కూళ్లను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తక్షణమే తనిఖీలు నిర్వహిస్తాం డ్రైవింగ్ స్కూళ్లపై తక్షణమే తనిఖీలు నిర్వహిస్తాం. డ్రైవింగ్ స్కూళ్లకు తప్పనిసరిగా రవాణాశాఖ అనుమతి ఉండాలి. బ్రాంచీల పేరుతో ఎక్కడబడితే అక్కడ డ్రైవింగ్ స్కూళ్లను నిర్వహించకూడదు. శిక్షణకు అత్యాధునిక మోడల్ వాహనాలను వినియోగించాలి. తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్దంగా ఉన్న డ్రైవింగ్ స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం. –ఎన్.శివరాంప్రసాద్,జిల్లా ఉపరవాణా కమిషనర్ -
టీచర్ల పదోన్నతులు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతులపై తీవ్ర గందరగోళం నెలకొంది. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో ఏకీకృత సర్వీసు రూల్స్ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని స్పష్టమైంది. దీంతో పదోన్నతుల అంశాన్ని ఉపాధ్యాయ వర్గాలు తెరపైకి తెస్తున్నాయి. పదోన్నతి ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉండటంతో భర్తీ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ‘ఏకీకృతం’అంశం కోర్టు పరిధిలో ఉండటంతో పదో న్నతుల ఊసెత్తని రాష్ట్ర ప్రభుత్వం.. కోర్టు అంశాన్ని సాకుగా చూపుతూ బదిలీలే చేపట్టింది. కోర్టు తీర్పు తో స్పష్టత వచ్చినందున పదోన్నతులకు పాత పద్ధతే విద్యాశాఖ ముందున్న ఏకైక మార్గమని తెలుస్తోంది. పాత విధానంతోనే.. ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయాలంటే పార్లమెంటు చట్ట సవరణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం లేదు. అప్పటివరకు పదోన్నతులు చేపట్టకుంటే విద్యాశాఖలో మరింత ఆటుపోట్లు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంఈవో, ఉపవిద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉండడంతో పాఠశాలల పర్యవేక్షణ అగమ్యగోచరంగా మారింది. ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నా అకడమిక్ కార్యక్రమాలు, పరిపాలన అంశాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదు. ‘ఏకీకృతం’విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పొస్తుందని భావించిన విద్యాశాఖ 4ఏళ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతులను చేపట్టలేదు. తాజా హైకోర్టు తీర్పులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో పదోన్నతులకు పాత పద్ధతే విద్యాశాఖ ముందున్న ఏకైక మార్గమని తెలుస్తోంది. యాజమాన్యాల వారీగా స్థానిక సంస్థలు, ప్రభుత్వ పాఠశాలల్లో పదోన్నతులు చేపడితే సరిపోతుందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెం ట్లు, జీహెచ్ఎం కేటగిరీ వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. అయితే ప్రభుత్వ యాజమాన్య టీచర్లకు అనుకూలంగా గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలనే అంశంపై మరోకేసు కోర్టు పరిధిలో ఉంది. దీంతో స్కూల్ అసిస్టెంట్, గెజిటెడ్ హెడ్మాస్టర్ కేటగిరీల్లో పదోన్నతులు సులభతరమైనా ఎమ్ఈవో,డైట్ లెక్చరర్ తదితర పోస్టుల్లో చిక్కులు తప్పవని తెలుస్తోంది. -
ఎన్పీఎస్ ఉపసంహరణ అవకాశం ఇక మూడేళ్లకే..
పశ్చిమగోదావరి, నిడమర్రు : జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్) ఖాతాదారులు తాము జమ చేసిన నగదులో కొంత మొత్తాన్ని ఇకపై మూడేళ్ల తర్వాతే తీసుకునేలా ఇటీవల నిబంధనలను సవరించారు. ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) జనవరిలో ఓ నోటీసులో పేర్కొంది. ఇప్పటివరకూ చందాదారులు భవిష్యత్తు కోసం దాచుకోవడం ప్రారంభించిన సొమ్మును, ఎంత అత్యవసరమైనా సుదీర్ఘ కాలం పాటు తీసుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పటివరకూ పదేళ్లు పథకంలో కొనసాగిన తర్వాత మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అనుమతించేవారు. తాజా ఉత్తర్వుల ప్రకారం పథకంలో చేరిన మూడేళ్ల తర్వాత నిర్దిష్ట అవసరాల కోసం ఎన్పీఎస్ నుంచి సొమ్ము తీసుకునేందుకు ఇకపై అనుమతిస్తారు. గత నెల 10వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ తాజా నిబంధనలు తెలుసుకుందాం. పాక్షిక ఉపసంహరణకు గరిష్ట మొత్తం 25 శాతం.. పాక్షిక వాపసు తీసుకునేందుకు అనుమతించే గరిష్ట మొత్తం 25 శాతం మాత్రమే. ఎన్పీఎస్ ఖాతాలు రెండు రకాలు టైర్ 1 ఖాతాలో జమ చేసే సొమ్మును 60 ఏళ్ల వయసు వచ్చేవరకు ఉపసంహరించుకునే వీల్లేదు. టైర్ 2 ఖాతా తెరిచిన వారికి సేవింగ్స్ ఖాతా మాదిరి ఎప్పుడైనా ఉనసంహరణకు అనుమతిస్తారు. అంటే చందాదా రుడు చెల్లించిన మొత్తానికి 25 శాతం మించిన మొత్తాన్ని మాత్రమే అనుమతిస్తారు. ప్రభుత్వ వాటాగా చెల్లించవలసిన 10 శాతం మొత్తం నుంచి పాక్షిక ఉనసంహరణకు అనుమతించరు. మొదటి తరహా ఖాతా విషయంలోనే ఉపసంహరణ నిబంధనలు ఇప్పుడు సవరించారు. నిబంధనలు ఇలా ♦ చందాదారునికి పిల్లలు/చట్టబద్ధంగా దత్తత పొందిన పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి ♦ చందాదారుని పిల్లలు/చట్టబద్ధంగా దత్తత పొందిన పిల్లల వివాహం కోసం ♦ చందాదారుడు సొంతంగా కాని/జీవిత భాగస్వామితో గాని కలిపి నివాసగృహం/ప్లాట్ కొనుగోలు/నిర్మాణం కోసం (పూర్వీకుల ఆస్తి కాకుండా చందాదారుడు వ్యక్తిగతంగా కానీ ఉమ్మడిగా గాని గృహం/ప్లాట్ కలిగిఉంటే ఉపసంహరణకు అనుమతించరు) ♦ చందాదారుడు/జీవిత భాగస్వామి, పిల్లలు, దత్తత పిల్లలు, ఆధారిత తల్లిదండ్రులు పలు వ్యాధులతో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నప్పుడు వైద్య చికిత్సల కోసం అనుమతించే వ్యాధులు క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, ప్రైమరీ, పల్మనరీ ఆర్టిరియల్ హైపర్ టెన్సన్, మల్టిపుల్ స్లి్కరోసిస్, మేజర్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, ఆర్టోగ్రాఫ్ సర్జరీ, హార్ట్ వాల్వ్ సర్జరీ, స్ట్రోక్, మయోకార్టియల్ ఆంఫోరష్కన్, కోమా, అంధత్వం, పక్షవాతం, యాక్సిడెంట్, ప్రాణాంతక ఇతర వ్యాధులు ఉపసంహరణకు పరిమితులు ♦ పాక్షిక ఉపసంహరణ చందాదారుడు ఈ పరిమితులకు లోబడి అనుమతిస్తారు. ♦ చందాదారుడు జాతీయ పెన్షన్ పథకంలో చేరిన తేదీ నుంచి మూడేళ్లు పూర్తి అయి ఉండాలి. ♦ చందాదారుడు దరఖాస్తు చేసిన నాటికి చందాదారుడు చెల్లించిన మొత్తానికి 25 శాతం మించిన మొత్తాన్ని మాత్రమే అనుమతిస్తారు. గరిష్ట కాలపరిమితి జాతీయ పెన్షన్ పథకం కాలపరిమితి ముగిసేలోపు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పాక్షిక ఉనసంహరణకు అనుమతిస్తారు. పాక్షిక ఉపసంహరణకు చందాదారుడు సెంట్రల్ రికార్డు కీపింగ్ ఏజెన్సీ(సీఆర్ఏ) లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌కు తగిన ధ్రువీకరణ పత్రాలతో నోడల్ అధికారి ద్వారా దరఖాస్తు చేయాలి. చందాదారుడు ఏదేని అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేయవచ్చు. పాక్షిక ఉపసంహరణ విధానం చందాదారులు తమ పాక్షిక ఉపసంహరణ (పార్షియల్ విత్ డ్రాయల్) కోసం ఫారం 601పీడబ్లూ ఉపయోగించాలి. గత సర్క్యులర్‌లో ఉపసంహరణ దరఖాస్తు పంపుటకు వర్తించు మార్గదర్శకాలే పాక్షిక ఉపసంహరణ దరఖాస్తు పంపుటకు వర్తిస్తాయి. -
ఇదెక్కడి ‘సంత’ ?
ప్రతి బుధవారం పీలేరు పశువుల సంతలో పశువులను కొన్న మనుషులు వాటిని తరలించేందుకు మాత్రం రాక్షసత్వాన్ని వాడుతున్నారు. పశువులను ఇతర ప్రాంతాలకు తరలించేటపుడు లారీలలో 10 నుంచి 12, మినీలారీలో 8, క్యాబ్‌లో 4, ఇతర వాహనాల్లో అయితే వాటి కెపాసిటీ మించకుండా పశువులను తరలించాల్సి ఉంటుంది. అయితే పీలేరు మార్కెట్ కమిటీ అధికారులు నిబంధనలకు తిలోదకాలు వదలి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇక గేట్ నిర్వాహకులేమో ‘ఎవరేమనుకుంటే మాకేంటి..ఇవ్వాల్సింది ఇచ్చేయండి..లోడ్ మీ ఇష్టం’ అన్న తరహాలో వ్యవహరిస్తూ మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. పీలేరు: వారపు సంతకెళ్లి రకరకాల కూరగాయలు కొని సంచిలో వేసుకున్నట్టు పశువులను కొని మూట చుట్టేస్తున్నారు. పశువులను ఒకదానిపై ఒకటి కట్టిపడేసి ఎవరికీ అనుమానం రాకుండా వాహనాల చుట్టూ టార్పాలిన్æ పట్టలు, ప్లాస్టిక్ కవర్లతో కప్పివేస్తున్నారు. దీంతో ఊపిరి ఆడక పశువులు నరకం చూస్తున్నాయి. నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తున్న పీలేరు మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది తీరుపై ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు గుప్పుమంటున్నాయి. మూగవేదన వినబడదా? పీలేరు మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రతి బుధవారం పశువుల సంత నిర్వహిస్తున్నారు. వారపు సంతకు వచ్చే పశువుల రేటులో ఒక శాతం గేటు వసూలు చేసేవారు. అయితే ఇష్టారీతిన పశువులను తరలించడానికి వీలు లేదు. కానీ లారీల్లో ఊపిరి ఆడక పశువులు కొట్టుమిట్టాడుతూ చేసే మూగవేదన మార్కెట్ అధికారులకు, వ్యాపారులకు వినబడడం లేదు. చేయి తడిపితే చాలు ఒక్కో వాహనంలో ఎన్ని పశువులు లోడ్ చేసినా ఫర్వాలేదన్న రీతిలో అధికారుల వ్యవహరించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మాకేం కొత్తకాదు’ నిబంధనలకు వ్యతిరేకంగా పదుల సంఖ్యలో పశువులను తరలిస్తున్నారేంటని ప్రశ్నిస్తే ‘మీకు ఏం కావాలి, ఎవరు మీరు, ఇదేం మాకు మొదటి సారి కాదు’ అంటూ వాహనదారులు ప్రశ్నల పరంపర కురిపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని అదునుగా భావించిన పలువురు తమిళనాడుకు చెందిన వ్యాపారులు కారు చౌకగా పశువులను కొని వేలూరు, గుడియాత్తం, పుంగనూరు తదితర ప్రాంతాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. అదిగాక వారపు సంతలో ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని నామమాత్రపు బిల్లులు రాసి పంపేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యాపారులపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెపాసిటీ మేరకే... వారపు సంతలో కొనుగోలు చేసిన పశువులను వాహనాల కెపాసిటీ మేరకే తరలిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా పశువులను లోడ్ చేస్తే ఒప్పుకోం. ఎక్కడైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. ఎవరూ చేతివాటం చూపినట్లు నా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటా. -ఎస్. అక్బర్‌బాషా, సెక్ర టరీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ, పీలేరు -
ప్రొటోకాల్ ఉల్లంఘనులపై ఫిర్యాదు
మదనపల్లె: అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ప్రచార ఆర్భాటం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రొటోకాల్‌ను విస్మరించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సబ్‌కలెక్టర్ కృతికాబాత్రాకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం ఆయన నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సినప్రాధాన్యం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభంలో ఇవ్వకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన‘ హౌస్‌ఫర్ ఆల్’ పథకానికి సంబంధించి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పైలాన్ ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ నిబంధనల మేరకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. వీలైనంత త్వర గా శిలాఫలకాన్ని మార్చి ప్రొటోకాల్ నిబంధన ప్రకారం ముఖ్య అతిథి స్థానంలో తన పేరును ముద్రించి ఏర్పాటు చేయాలని కోరారు. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. స్పందించిన సబ్‌కలెక్టర్ ప్రొటోకాల్ ఉల్లంఘనపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, బిఏ ఖాజా, మస్తాన్‌రెడ్డి, ఎంపీపీ సుజనా బాలకృష్ణారెడ్డి, జరీనా హైదర్, జెడ్పీటీసీ సభ్యులు భాస్కర్, సుజాత, సర్పంచ్ శరత్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఫీజులుం
పరీక్ష ఫీజు పేరుతో ప్రయివేటు కళాశాలల దోపిడీ రూ.300 ఫీజుకు రూ.1,500 వసూలు రెండేళ్లకూ ఒకేసారి చెల్లిస్తే రూ.2,500 చెల్లించకపోతే పరీక్షల సమయంలో ఇబ్బందులని బెదిరింపులు అధికారులు పట్టించుకోవడం లేదంటున్న తల్లిదండ్రులు కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఆర్ఐవో గుడివాడ : ఇంటర్మీడియెట్ పరీక్షల ఫీజు పేరుతో ప్రయివేటు కళాశాలల నిర్వాహకులు విద్యార్థులను దోచుకుంటున్నారు. ఏడాదికి పరీక్ష ఫీజు రూ.300 కాగా, ఇందుకు ఐదు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే... పరీక్షల సమయంలో ఖర్చులుంటాయని బదులిస్తున్నారు. ఒక్కో ప్రయివేటు కళాశాల నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు రెట్లు అధికంగా వసూలు జిల్లాలో 23 ప్రభుత్వ, 227 ప్రయివేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో సుమారు ఐదు వేలమంది, ప్రయివేటు కళాశాలల్లో 95వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 65వేల మంది ప్రథమ సంవత్సరం, 35వేల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారని ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా అధికారి రాజారావు చెప్పారు. వీరందరూ పబ్లిక్ పరీక్షలకు ఈ నెల 17వ తేదీలోపు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. మొదటి ఏడాది విద్యార్థులు(అన్ని గ్రూపులు) కేవలం రూ.300 చొప్పున మాత్రమే చెల్లించాల్సి ఉంది. మొదటి ఏడాది సబ్జెక్టులు మిగిలి ఉండి వాటితోపాటు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు గరిష్టంగా రూ.600 చెల్లించాలి. ద్వితీయ సంవత్సరం సైన్స్ గ్రూప్ విద్యార్థులు మాత్రం ప్రాక్టికల్స్ ఫీజు నిమిత్తం రూ.100 అదనంగా చెల్లించాలని బోర్డు ప్రకటించింది. అయితే, గుడివాడలోని కొన్ని కళాశాలలు ఇందుకు విరుద్ధంగా మొదటి సంవత్సరం విద్యార్థుల నుంచి రూ.1,500 వసూలు చేస్తున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థుల నుంచి రెండేళ్లకు ఒకేసారి రూ.2,500 చొప్పున వసూలు చేస్తున్నారు. మరికొన్ని కాలేజీల నిర్వాహకులు ప్రథమ సంవత్సరం విద్యార్థులు రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడు తాము చెప్పినట్లు ఫీజు చెల్లించకపోతే పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, హాల్ టికెట్లు కూడా ఇవ్వబోమని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ లెక్కన 95 వేల మంది నుంచి అదనంగా వసూలు చేసే మొత్తం రూ.9కోట్ల వరకు ఉంటుందని అంచనా. కళాశాలల నిర్వాహకులు వసూలు చేసే మొత్తంలో ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులకు కూడా వాటాలు ఉంటాయని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందువల్లే వారు కళాశాలలవైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అదనంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి ఇప్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎక్కువ ఫీజు వసూలు చేస్తే చర్యలు : ఆర్ఐవో కళాశాలల యాజమాన్యాలు ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించిన ఫీజు కంటే అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా అధికారి(ఆర్ఐవో) రాజారావు చెప్పారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయని, ఆయా కళాశాలలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరైనా అదనంగా ఫీజులు వసూలు చేస్తే తన సెల్ నంబర్ 9848308998కు ఫోన్ చేయాలని ఆర్ఐవో సూచించారు. -
రుణమాఫీకి నిబంధనాలు
ఆధార్ కార్డు తప్పనిసరి రేషన్ కార్డూ ఉండాల్సిందే నందికొట్కూరుకు చెందిన సుదర్శన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి 2013లో రుణం తీసుకున్నాడు. ఈయన ఆధార్ కోసం నాలుగు సార్లు వివరాలు నమోదు చేయించుకున్నాడు. కానీ యూఐడీ నంబరు రాలేదు. దీంతో రుణమాఫీకి అర్హత పొందలేకపోయాడు. ప్యాపిలికి చెందిన క్రిష్టన్న అక్కడి పీఎసీఎస్ నుంచి గతేడాది పంట రుణం తీసుకున్నాడు. ఈయనకు రేషన్‌కార్డు లేదు. రేషన్‌కార్డు కోసం గత ప్రభుత్వ హయాంలో రచ్చబండ కార్యక్రమం జరిగిన ప్రతిసారీ దరఖాస్తు చేసుకున్నాడు. కానీ కార్డు రాలేదు. రేషన్‌కార్డు రాలేదనే కారణంతో రుణమాఫీకి అర్హత పొందలేకపోయాడు. కర్నూలు(అగ్రికల్చర్): రుణమాఫీకి విధిగా ఆధార్, రేషన్‌కార్డు ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. దీంతో జిల్లాలో వేలాది మంది రైతులు రుణమాఫీకి దూరమవుతున్నారు. ఎల్డీఎం(లీడ్ డిస్ట్రిక్ మేనేజర్) రూపొందించిన ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో రుణమాఫీకి అర్హత కలిగిన రైతులు 5.75 లక్షల మంది ఉన్నారు. అయితే ఆధార్, రేషన్ కార్డు లింకప్ చేయడంతో వారిలో 20 శాతానికి పైగా అనర్హులుగా మిగులుతున్నారు. రేషన్‌కార్డు ఉంటే ఆధార్ లేకపోవడం, ఆధార్ ఉంటే రేషన్‌కార్డు లేకపోవడంతో దాదాపు లక్షల మంది రైతుల వివరాలు నమోదు కాలేదు. గడువు ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం జిల్లాకు వస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట తమ గోడును అర్థం చేసుకొని గడువును పెంచేలా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. ఉద్యాన రైతులు ఏం పాపం చేశారు.. ఉద్యాన పంటలకు రుణమాఫీ కల్పించలేకపోవడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వర్షాధారం కింద ఉద్యాన పంటలు అయిన మిరప, ఇతర కూరగాయలు పంటలు సాగు చేస్తారు. వీటికి బ్యాంకులు పంట రుణాలు ఇస్తున్నాయి. కానీ ఉద్యాన పంటలకు రుణమాఫీ లేకపోవడాన్ని అన్నదాతలు తప్పుబడుతున్నారు. ఉద్యాన రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నిస్తున్నారు. ‘ముప్పై’ తిప్పలు రుణమాఫీ సంబంధించి రైతుల సమాచారాన్ని 31 కాలమ్స్‌లో పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. 31 కాలమ్స్ ప్రకారం బ్యాంకులు సమాచారాన్ని సిద్ధం చేశాయి. అయితే మళ్లీ రైతు సాగు చేసిన విస్తీర్ణం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వివరాలు పంపాలని ఆదేశించింది. దీనిని ఎన్ఐసీ అధికారులు రూపొందించి బ్యాంకులకు ఇవ్వాలి. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వం మాత్రం ఈనెల 25 సాయంత్రానికి రుణమాఫీ వివరాలను పంపాలని బ్యాంకర్లను ఆదేశించింది. దీంతో బ్యాంకర్లు తలలు పట్టుకుంటున్నారు. వడ్డీ ‘మోత’ 2013 డిసెంబర్ 31 లోపు రుణాలు తీసుకుని అప్పటికి నిల్వ ఉన్న వాటికే మాఫీ వర్తింపజేసే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 2014 జనవరి నుంచి ఇప్పటివరకు అయిన వడ్డీని రైతులే భరించాలి. ఈ వడ్డీని వసూలు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. దీంతో బ్యాంకులు రుణమాఫీ వర్తించే రైతులను సైతం వడ్డీ చెల్లించమని ఒత్తిడి తెస్తున్నారు. ఎస్బీఐ, ఏపీజీబీ, కేడీసీసీబీ, ఆంధ్రాబ్యాంకు తదితర బ్యాంకులను సైతం వడ్డీ చెల్లించాలని నోటీసులు ఇచ్చాయి. ప్రభుత్వం నిర్ణయం వల్ల జిల్లా రైతులపై రూ.110 కోట్లు వడ్డీ భారం పడుతోంది. బీమా పాయె.. రుణమాఫీలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం.. జిల్లాలో నాలుగు లక్షల మంది రైతులను పంటల బీమాకు దూరం చేసింది. ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలను చెల్లించవద్దు... అధికారంలోకి వచ్చాక మాఫీ చేస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో రైతులు రుణాలు చెల్లించలేదు. అధికారం చేపట్టాక రుణమాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు తాత్సారం చేశారు. ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోయారు. దీంతో ఖరీఫ్‌లో రూ.2100 కోట్ల పంట రుణాలకు గాను రూ. 700 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఫలితంగా నాలుగు లక్షల మంది ఈ సారి పంటల బీమాకు దూరమయ్యారు.