అమితాబ్ బచ్చన్
యాభై ఏళ్లుగా కెమెరా ముందే ఉంటూ భారతీయ ప్రేక్షకులను అలరిస్తున్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. నటుడిగా, నిర్మాతగా, కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ అందించిన ఆయన ఎప్పుడూ డైరెక్టర్ చైర్‌లో కూర్చోలేదు. తాజాగా ‘చెహ్రే’ సినిమాలో కొన్ని సన్నివేశాలకు దర్శకుడిగా మారారు బచ్చన్.
ఇమ్రాన్ హష్మీ, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో రూమీ జాఫ్రీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘చెహ్రే’. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాలో ఉద్యోగ విరమణ చేసిన లాయర్‌గా కనిపించనున్నారు అమితాబ్ బచ్చన్. ఈ సినిమా షూటింగ్ కోసం స్లోవాకియా వెళ్లారు చిత్రబృందం. అక్కడ తీసిన ఓ చేజ్ సన్నివేశం, చిన్న ఫైట్ సీన్‌కి బచ్చన్ దర్శకత్వం వహించారట. మరి పూర్తిస్థాయిలో సినిమాను డైరెక్ట్ చేసే ఉద్దేశం అమితాబ్‌కి ఉందా? లేదా? సమాధానం ఆయనే చెప్పాలి. ‘చెహ్రే’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 24న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment