
లాయర్‌గా లారాదత్తా?
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అజహర్’. ఇందులో టైటిల్ రోల్‌ను ఇమ్రాన్ హష్మీ చేస్త్తున్నారు. టోనీ డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతా బిజ్లానీ పాత్రను నర్గిస్ ఫక్రి చేస్తున్నారు. కాగా, లాయర్ పాత్ర కోసం ‘లంచ్ బాక్స్’ ఫేం నిమ్రత్ కౌర్‌ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ, ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో ఈ పాత్రకు లారాదత్తాను ఎంపిక చేశారని సమాచారం.