సల్మాన్ ఖాన్‌‌ వర్సెస్‌ ఇమ్రాన్‌ హష్మీ | Emraan Hashmi To Play Villain Role In Salman Next Movie | Sakshi
Sakshi News home page

సల్మాన్‌కు విలన్‌గా ఇమ్రాన్‌ హష్మీ

Published Sat, Feb 13 2021 10:44 AM | Last Updated on Sat, Feb 13 2021 12:10 PM

Emraan Hashmi To Play Villain Role In Salman Next Movie - Sakshi

ముంబై: ‘ఏక్‌ థా టైగర్, టైగర్‌ జిందా హై’ చిత్రాల తర్వాత మళ్లీ ఏజెంట్‌ టైగర్‌గా నటించనున్నారు సల్మాన్‌ ఖాన్. టైగర్‌ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం ‘టైగర్‌ 3’. మనీష్‌ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్‌ కథానాయిక. ఈ సినిమాలో ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటించనున్నారు. సల్మాన్‌ ను ఢీకొనే సీరియస్‌ విలన్‌ గా ఇమ్రాన్‌ పాత్ర ఉంటుందట. మార్చి నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ముంబైలో మొదటి షెడ్యూల్‌ తర్వాత దుబాయ్‌కి వెళ్లనుంది చిత్రబృందం. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో యశ్‌ రాజ్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement