Ek Tha Tiger
-
సల్మాన్ ఖాన్ వర్సెస్ ఇమ్రాన్ హష్మీ
ముంబై: ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై’ చిత్రాల తర్వాత మళ్లీ ఏజెంట్ టైగర్‌గా నటించనున్నారు సల్మాన్ ఖాన్. టైగర్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ కథానాయిక. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించనున్నారు. సల్మాన్ ను ఢీకొనే సీరియస్ విలన్ గా ఇమ్రాన్ పాత్ర ఉంటుందట. మార్చి నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ముంబైలో మొదటి షెడ్యూల్ తర్వాత దుబాయ్‌కి వెళ్లనుంది చిత్రబృందం. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో యశ్ రాజ్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. -
ఓ జింక ‘ఆత్మహత్య’ కథ
గడచిన కొద్దిరోజులుగా.. అంతకు కొద్దినెలల ముందు.. సోషల్ మీడియాలో ‘‘ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ఇండియా’’ అంటూ ట్యాగ్లు హల్చల్ చేశాయి. ‘‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..?’’ ప్రశ్న పాతదైపోయింది. ‘‘కృష్ణజింకను ఇంతకీ ఎవరు చంపారు..?’’ అనే కొత్త చిక్కుముడిని విప్పేందుకే నెటిజన్లు గూగుల్‌ను జల్లెడ పడుతున్నారు. ఇంతకూ ఆ జింకను ఎవరు చంపి ఉంటారు..? కొందరు చెప్పేమాట ‘ఏక్‌థా టైగర్’. ఇంకొందరి సందేహం.. ‘‘జింకే తనను తాను ఎందుకు కాల్చుకుని ఉండకూడదూ..’’ అని!! సల్మాన్ ఖాన్‌ను రాజస్తాన్ హైకోర్టు తాజాగా నిర్దోషిగా ప్రకటించినా.. జింకలను చంపింది సల్మానేనని ఆనాడు జీపు డ్రైవర్‌గా ఉన్న హరీష్ దులానీ చెబుతున్నాడు. కానీ పోలీసుల దర్యాప్తు మాత్రం జింక తనకు తానే కాల్చుకుని చనిపోయిందన్న తీరులో సాగిందని ఫేస్బుక్లో సెటైర్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటో వివిధ సామాజిక అనుసంధాన వెబ్సైట్లలో వైరల్ అవుతోంది. అనగనగా 1998.. అక్టోబర్ 1.. చీకటి పడుతోంది. ‘ఏక్‌థా టైగర్’కు మెలకువ వచ్చింది. బద్ధకంగా ఒళ్లు విరుచుకుని చుట్టూ చూసింది. బ్రెడ్, బటర్, శాండ్విచ్, రోటీ, దాల్... పులికి చిరాకొచ్చింది. ‘డొక్క మాడితే మాత్రం.. పులి గడ్డి తింటుందా..?’ నో చాన్స్! ఒకే ఒక్క జంప్.. వెళ్లి తన వెహికల్లో పడింది. బండి రయ్య్ మంటూ దూసుకుపోతోంది. దారి మధ్యలో టైగర్ జస్ట్ అలా వెనక్కి ఓ టర్నింగ్ ఇచ్చుకుంది. ఎలా వచ్చి చేరాయో గానీ, అప్పటికే ఓ మగ పులి, మరో మూడు ఆడ పులులు వెనక సీట్లో దర్జాగా కూర్చొని ఉన్నాయి. ఆశగా నాలుకలు వెలుపలికి పెట్టి, నిమిషానికొకసారి చప్పరించుకుంటున్నాయి. కడుపు మాడితే టైగర్ ఎలాగూ వేటాడుతుంది.. మనకీ నాలుగు బోన్స్ దొరక్కపోతాయా అని ఆ పులుల ఆశ! చిన్నవిషయాలకూ గొప్పలకు పోయే నైజమున్న మన టైగర్.. వెనకాలే కూర్చున్న స్వజాతి జీవుల ముందు తన రాజసం చూపాలనుకుంది. అయితే, ఈసారి రొటీన్‌గా పంజా విసరకూడదు. ఏదైనా డిఫరెంట్‌గా.. స్టైల్‌గా చెయ్యాలి. అసలే వెనకాల మూడు అందమైన ఆడపులులు ఉన్నాయిగా..! కాస్త వెరైటీగా కూడా ఉండాలి ఏం చేసినా..! అందుకే టైగర్ తన పంజాను పీకి అవతల పారేసింది. బదులుగా ఓ గన్ పట్టుకుంది. ‘‘ఏం తింటారు గయ్య్స్స్..!’’ అంటూ స్టైల్‌గా అడిగి హెయిర్‌స్టైల్‌ను సరిచేసుకుంది. వాటినుంచి ఏం సమాధానం వచ్చిందో ఏమో.. వెంటనే వెహికల్ దిగేసి, తుపాకీని ఎక్కుపెట్టింది. దూరంగా మినుకుమినుకుమంటూ రెండు చిన్నపాటి బల్బుల కాంతి.. ‘‘యస్..! దొరికేసింది. అది జింకే అనుకుంటా. రాత్రివేళ కదా.. కనుగుడ్లు మెరుస్తున్నాయి. యుమ్మీ..!’’ అంటూ ట్రిగ్గర్‌ని ఒక్క నొక్కు నొక్కింది. ఢామ్మ...ని పెద్ద శబ్దం, ఓ పొదల చాటున గిలగిలా కొట్టుకుంటోన్న కృష్ణజింక చప్పుడు చిన్నగా వినిపిస్తోంది. ఎవరూ చూడలేదు కదా.. అన్నట్టుగా ఏక్‌థా టైగర్ చుట్టూ చూసింది. హమ్మయ్య.. ఎవ్వరూ లేరు. కళ్లు మూసుకుని పాలు తాగేయ్యొచ్చు ఇప్పుడు! మిగతా పులులు కూడా కళ్లు మూసుకున్నాయి. ఈ పనంతా ఏ మార్జాలమో చేస్తే ఓకే.. చెల్లిపోతుంది. వెరైటీగా పులి కళ్లు మూసుకోవడమేంటీ.. అక్కడే వచ్చింది చిక్కంతా. దూరం నుంచి ఎవడో చూసేశాడు. బిష్ణోయ్ కులస్థుడంట. వాడికి పిచ్చిపిచ్చిగా కోపమొచ్చేసింది. ‘‘ఏయ్.. నీ పని పడతా..’’ అంటూ వెంబడించాడు. టైగర్ అలర్ట్ అయింది. వెహికల్ రివ్వున దూసుకుపోయింది. ఈ బిష్ణోయ్ బాబు ఆగలేదు. వెంబడించి వెంబడించి.. వెనక్కి వచ్చేశాడు. తమవాళ్లందరినీ ఓ చోట చేర్చాడు. ‘‘మనం దేవతలా పూజించే జింకలను ఆ ఏక్‌థా టైగర్ చంపేసిందిరా..’’ అంటూ ఏడ్చాడు. అంతే.. తెల్లవారింది. సమీపంలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది. విచారణ కూడా వెంటనే మొదలైంది. అప్పటి నుంచి అది జీడిపాకంలా సాగుతూనే ఉంది. నిన్నగాక మొన్ననే దీనికి పుల్‌స్టాప్ పడింది. ‘యస్.. టైగర్ నిర్దోషి’! ‘‘మరి.. కళ్లారా చూసిన నేనేమవుతానురా..’’ అంటూ ఏడ్చాడు బిష్ణోయ్ బాబు. ‘‘ఉండొచ్చు గానీ, మరీ అంత పిచ్చి ఉండకూడదు. అయినా, జంతువుల మీద ప్రేమ ఏంట్రా. పిచ్చివాడా..’’ అంటూ కొందరు నవ్విపోయారు. మరికొందరు సానుభూతి చూపారు. ‘‘పోనీలే, పోయింది కృష్ణ జింకేగా.. మనకి మన టైగర్ మిగిలింది. అదే పదివేలు’’ అని ఊపిరి పీల్చుకున్నారు ఇంకొందరు దేశభక్తులు. కానీ, కొందరికి మాత్రం ఎప్పుడూ ప్రశ్నలతోనే సావాసం. టైగర్ చంపకుంటే, జింక ఎలా చనిపోయినట్టూ.. అంటూ ఆరాలు తీశారు. దీనికి వినిపించిన సమాధానాలు.. టైగర్ లెసైన్స్డ్ గన్ నుంచి ఒక్క తూటా కూడా పేలలేదు. టైగర్ వెహికల్లో దొరికిన తూటాల తొడుగులు ఆ తుపాకీ నుంచి వచ్చినవి కాదు. ఒకవేళ వచ్చినా ఆ తూటాలు జంతువులను చంపేంత శక్తిమంతమైనవి కాదు. మొదట్లో వెహికల్లో తూటాలు లేనేలేవు. పోలీసుల తనిఖీ తర్వాతే వచ్చిచేరాయి. అంటే.. ఏంటి అర్థం..? పోలీసులే కుట్ర చేశారని కదా..! ఇలా బోలెడన్ని సమాధానాలు ఇప్పటికీ వినిపిస్తాయి. అన్నీ సందేహం రేకెత్తించే సమాధానాలే.. ఏదీ టైగర్ మీద పడిన మచ్చను చెరిపేలా లేదు. స్పష్టతనిచ్చేలా అసలే లేదు. దీన్నే క్రికెట్ పరిభాషలో ‘‘బెనిఫిట్ ఆఫ్ డౌట్..’’ అంటారు. అంటే.. క్రీజులో బ్యాట్ పట్టుకునే టైగర్‌కు అనుకూలమైన నిర్ణయం అన్నమాట. మరింకేం..? ఇది కూడా అలానే అనుకుందాం. టైగర్‌ను చూసిన ఆనందంలో జింకే తనను తాను కాల్చుకుందని అనుకుందాం. చివరగా.. బెనిఫిట్ ఆఫ్ డౌట్. కృష్ణ జింక అవుట్!! -
అదృష్టవంతురాలిని...
ముంబై: తాను నటించిన సినిమాల్లో అనేకం బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయని, అందువల్ల తానెంతో అదృష్టవంతురాలినని బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గర్వంగా చెప్పింది. 31 ఏళ్ల కత్రినా నటించిన ‘ధూమ్-3’, ‘ఏక్ థా టైగర్’, జబ్ తక్ హై జాన్’, ‘రాజ్‌నీతి’ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ‘బాక్సాఫీస్ వద్ద విజయం అనేది నాకొక విషయమే కాదు. ప్రతి ఒక్కరూ తమ సినిమాలు హిట్ కావాలని ఆశిస్తారు. ఎందుచేతనంటే వారు ఆ సినిమా కోసం ఎంతో కష్టపడి ఉంటారు. ఈ రంగంలో ఉన్నవారు దేనినైనా మనస్ఫూర్తిగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. అయితే నా అదృష్టం ఏమిటంటే ఇప్పటివరకూ రెండో కోణం ఎదురుకాకపోవడం. నేను నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. అందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా తదుపరి సినిమాకూడా అదే జాబితాలోకి చేరుతుందని ఆశిస్తున్నా. ఎంతో కష్టపడి నటించిన తర్వాత కూడా సినిమా ఆడకపోతే ఎవరికైనా గుండె పిండి అవుతుంది. అది అంత మంచిది కూడా కాదు’ అని అంది. ఇండస్ట్రీలో నంబర్ అనిపించుకునే స్థాయిలో ఉన్న కత్రినా...ప్రేక్షకులు తనను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు మురిసిపోతోంది. అయితే ప్రేక్షకులు నటులను ఆదరించాలని, ఆమోదించాలని చెబుతోంది. ‘ప్రేక్షకుల ఆమోదముద్ర అనేది నాకు ఎంతో ముఖ్యం. మన ప్రేక్షకులు నిజాయితీ కలిగినవారు. అవలీలగా క్షమించేస్తారు. వారు ఎంతో మంచివారు కూడా. నటన బాగుంటే ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు’అని అంది.కాగా కత్రినా తాజాగా నటించిన ‘బిగ్ బ్యాంగ్’ సినిమా వచ్చే నెల రెండో తేదీన విడుదల కానుంది. -
నాకు రెండో కోణం ఎదురుకాలేదు: కత్రినా
తాను నటించిన సినిమాల్లో అనేకం బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయని, అందువల్ల తానెంతో అదృష్టవంతురాలినని బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గర్వంగా చెప్పింది. 31 ఏళ్ల కత్రినా నటించిన ‘ధూమ్-3’, ‘ఏక్ థా టైగర్’, జబ్ తక్ హై జాన్’, ‘రాజ్‌నీతి’ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ‘బాక్సాఫీస్ వద్ద విజయం అనేది నాకొక విషయమే కాదు. ప్రతి ఒక్కరూ తమ సినిమాలు హిట్ కావాలని ఆశిస్తారు. ఎందుచేతనంటే వారు ఆ సినిమా కోసం ఎంతో కష్టపడి ఉంటారు. ఈ రంగంలో ఉన్నవారు దేనినైనా మనస్ఫూర్తిగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. అయితే నా అదృష్టం ఏమిటంటే ఇప్పటివరకూ రెండో కోణం ఎదురుకాకపోవడం. నేను నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. అందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా తదుపరి సినిమాకూడా అదే జాబితాలోకి చేరుతుందని ఆశిస్తున్నా. ఎంతో కష్టపడి నటించిన తర్వాత కూడా సినిమా ఆడకపోతే ఎవరికైనా గుండె పిండి అవుతుంది. అది అంత మంచిది కూడా కాదు’ అని అంది. ఇండస్ట్రీలో నంబర్ అనిపించుకునే స్థాయిలో ఉన్న కత్రినా...ప్రేక్షకులు తనను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు మురిసిపోతోంది. అయితే ప్రేక్షకులు నటులను ఆదరించాలని, ఆమోదించాలని చెబుతోంది. ‘ప్రేక్షకుల ఆమోదముద్ర అనేది నాకు ఎంతో ముఖ్యం. మన ప్రేక్షకులు నిజాయితీ కలిగినవారు. అవలీలగా క్షమించేస్తారు. వారు ఎంతో మంచివారు కూడా. నటన బాగుంటే ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు’ అని అంది. కాగా కత్రినా తాజాగా నటించిన ‘బిగ్ బ్యాంగ్’ సినిమా వచ్చే నెల రెండో తేదీన విడుదల కానుంది. -
ఆ పలకలు నకిలీవా?
బాలీవుడ్లో మంచి కండలు తిరిగిన దేహమున్న హీరో ఎవరంటే.. సల్మాన్ ఖాన్ పేరే చెబుతారు. ఈయనగారికి కండలవీరుడు అనే పేరు కూడా ఉంది. ఆ మధ్య ‘ఏక్ థా టైగర్’ చిత్రంలో చొక్కా విప్పి, తన ఆరు పలకల దేహాన్ని చూపించారు సల్మాన్. ఆ సిక్స్ ప్యాక్ చూసి, సల్మాన్ అభిమానులు స్వీట్ షాక్‌కి గురయ్యారు. అయితే ఇప్పుడు వాళ్లకి మరో రకమైన షాక్ తగిలింది. సల్మాన్‌కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో చొక్కా లేకుండా కనిపిస్తున్నారు సల్మాన్. అదేం పెద్ద విషయం కాదు కానీ సినిమాల్లో ఆయన చొక్కా విప్పినప్పుడు కనిపించే ఆరు పలకలు, ఈ వీడియోలో కనిపించక పోవడం విశేషం. దాంతో ఆ సిక్స్ ప్యాక్ ఎలా మాయమైంది? అనేది హాట్ టాపి కైంది. సినిమాల్లో ఏదో కంప్యూటర్ జిమ్మిక్ చేసి, సల్మాన్‌కి సిక్స్ ప్యాక్ ఉన్నట్లు చూపిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మరి తనది నకిలీ ఆరు పలకల దేహమనే ఈ నిందకు సల్మాన్ ఏం జవాబు చెబుతారో చూడాలి. -
చల్లని మనసున్న పాట...
ఏక్ థా టైగర్, ఫ్రం సిడ్నీ విత్ లవ్, రాకీ, జంజీర్...మొదలైన సినిమాల్లో పాటలు పాడిన ఇండోర్ అమ్మాయి పాలక్ ముచ్చల్, సామాజికసేవ విభాగంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. చిన్న వయసులోనే ఎన్నో పురస్కారాలను అందుకుంది. పాలక్ ముచ్చల్‌తో మాట్లాడడం అంటే తీయటి పాటల బాలీవుడ్ గాయనితో మాట్లాడడమే కాదు...తన వంతుగా సమాజానికి సేవ చేయాలనుకొనే నవతరం ప్రతినిధితో మాట్లాడినట్లు కూడా. ఇరవై రెండేళ్ల పాలక్ మనసులోని మాటలు... మా కుటుంబంలో ఎవరికీ పాటలు పాడిన నేపథ్యం లేదు. వ్యాపారం తప్ప మరొకటి తెలియదు. నేను మాత్రం రెండు సంవత్సరాల వయసు నుంచే పాడడం మొదలుపెట్టాను. హార్ట్ పేషెంట్ల సహాయార్థం షోలు చేస్తుంటాను. నా ‘షో’ల ద్వారా వచ్చిన డబ్బుతో 530 మంది పేషెంట్లకు సహాయపడ్డాను. మరో 621 మంది నా సహాయం కోసం వేచి చూస్తున్నారు. వారికి తప్పకుండా సహాయం చేస్తాను. రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్న పిల్లలు తమ చొక్కాలతో ఫ్లోర్ శుభ్రం చేస్తూ కనిపిస్తారు. వారిని చూస్తే గుండె తరుక్కుపోతుంది. నాకోసం కాకుండా పరుల సంక్షేమం కోసం ఏదో ఒకటి చేయాలనేది నా ఆలోచన. కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు నా వయసు అయిదు సంవత్సరాలు. సైనికుల కోసం నా వంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. వీధిలో ప్రతి దుకాణానికీ వెళ్లి పాటలు పాడి డబ్బులు అడిగేదాన్ని. అలా మా కాలనీలోనే పాతిక వేలు సేకరించాను. ఒడిశాలో తుపాను వచ్చినప్పుడు కూడా వీధి వీధి తిరిగి, పాటలు పాడి డబ్బు సేకరించి సహాయనిధికి పంపాను. ఇండోర్‌కు చెందిన లోకేశ్ అనే అబ్బాయికి గుండెలో రంధ్రం పడింది. అతని తల్లిదండ్రులేమో బీదవాళ్లు. వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేదు. ‘‘నేను వాళ్లకు సహాయపడాలనుకుంటున్నాను’’ అని మా తల్లిదండ్రులకు చెప్పాను. ఒక వీధిలో నా కోసం చిన్న వేదిక ఒకటి ఏర్పాటు చేశారు నాన్న. పేషెంట్‌కు కావల్సిన మొత్తం సమకూర్చుకోవడానికి కొన్ని రోజులు పడుతుందేమో అనుకున్నాను. ఆశ్చర్యమేమిటంటే, ఒకే ఒక రోజులో 55,000 వచ్చాయి! ఆ డబ్బు వారికి సరిపోతుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఒక పేషెంట్ కోసం, పాటల ద్వారా నేను డబ్బులు సేకరిస్తున్నాననే విషయం తెలిసి బెంగళూరుకు చెందిన ఒక వైద్యుడు ఆపరేషన్ ఉచితంగా చేయడానికి ముందుకువచ్చాడు. ఆ 55, వేలంలో... ఎవరి డబ్బు వారికి తిరిగి ఇచ్చేయాలనుకున్నాం. కానీ అది అసాధ్యం అనే విషయం అర్థమైంది. మంచి మనసుతో దాతలు ఇచ్చిన ఆ సొమ్మును ఆపదలో ఉన్న వారి కోసం ఉపయోగించాం. ఈ మొత్తం వ్యవహారంలో నాకు అర్థమైన విషయం ఏమిటంటే ‘పాట’అనేది నలుగురిని సంతోష పెట్టడానికే కాదు...నలుగురిని ఆదుకోవడానికి కూడా అని!