ఆ పలకలు నకిలీవా?
బాలీవుడ్‌లో మంచి కండలు తిరిగిన దేహమున్న హీరో ఎవరంటే.. సల్మాన్ ఖాన్ పేరే చెబుతారు. ఈయనగారికి కండలవీరుడు అనే పేరు కూడా ఉంది. ఆ మధ్య ‘ఏక్ థా టైగర్’ చిత్రంలో చొక్కా విప్పి, తన ఆరు పలకల దేహాన్ని చూపించారు సల్మాన్. ఆ సిక్స్ ప్యాక్ చూసి, సల్మాన్ అభిమానులు స్వీట్ షాక్‌కి గురయ్యారు.
అయితే ఇప్పుడు వాళ్లకి మరో రకమైన షాక్ తగిలింది. సల్మాన్‌కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో చొక్కా లేకుండా కనిపిస్తున్నారు సల్మాన్. అదేం పెద్ద విషయం కాదు కానీ సినిమాల్లో ఆయన చొక్కా విప్పినప్పుడు కనిపించే ఆరు పలకలు, ఈ వీడియోలో కనిపించక పోవడం విశేషం. దాంతో ఆ సిక్స్ ప్యాక్ ఎలా మాయమైంది? అనేది హాట్ టాపి కైంది. సినిమాల్లో ఏదో కంప్యూటర్ జిమ్మిక్ చేసి, సల్మాన్‌కి సిక్స్ ప్యాక్ ఉన్నట్లు చూపిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మరి తనది నకిలీ ఆరు పలకల దేహమనే ఈ నిందకు సల్మాన్ ఏం జవాబు చెబుతారో చూడాలి.