azhar
-
అజహర్‌కు రూ. 1.5 కోట్లు
ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌కు బాకీగా ఉన్న రూ. కోటీ 50 లక్షలను చెల్లించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ మొత్తాన్ని అజహర్‌కు ఇవ్వాలని బోర్డు ఏజీఎంలో నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. బోర్డు నిబంధనల ప్రకారం మాజీ ఆటగాళ్లకు ఇవ్వాల్సిన పెన్షన్ తదితర సౌకర్యాలతో కలిపి అజ్జూకు రూ. కోటిన్నర రావాల్సి ఉంది. అయితే అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన నిషేధం కొనసాగుతుండటంతో బోర్డు వీటిని నిలిపివేసింది. 2012లోనే ఏపీ హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, తన బాకీలు చెల్లించాలంటూ రెండేళ్ల క్రితమే అజహర్ విజ్ఞప్తి చేశాడు. అయితే సీఓఏ మాత్రం స్పందించలేదు. ఎట్టకేలకు ఇప్పుడు బోర్డు అధ్యక్షుడి హోదాలో గంగూలీ తన తొలి కెప్టెన్‌కు మేలు చేకూర్చేలా అధికారిక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న అజహర్... భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు. -
నేను స్త్రీలోలుడినా! 'అజార్'తో సీనియర్ క్రికెటర్ షాక్!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవితం వివాదాలమయం. ఇప్పుడు ఆయన జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'అజార్' సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇమ్రాన్ హష్మీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజగా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కూడా ఈ చిత్రంలో తన పాత్రను చిత్రించిన తీరు చూసి షాక్ తిన్నాడంట. తనను ఇంత దారుణంగా సినిమాలో చూపిస్తారా? అని ఆయన మండిపడుతున్నట్టు తెలుస్తోంది. 'అజార్' సినిమాలో రవిశాస్త్రి పాత్రను గౌతం గులాటీ పోషించాడు. సినిమాలో ఏ క్రికెటర్ పేరును పూర్తిగా ఉపయోగించలేదు. కానీ అజార్ క్రికెట్ ఆడుతున్నప్పుడు సహ క్రికెటర్లు పిలుచుకొనే పొట్టిపేర్లనే ఇందులో వాడారు. అందులో భాగంగానే అజార్, రవి, నవజ్యోత్, మనోజ్, కపిల్ వంటి పేర్లను ఉపయోగించారు. వీళ్లందరూ అజార్‌తో కలిసి క్రికెట్ ఆడినవాళ్లే. కాబట్టి సహజంగానే సినిమాలో వీరి ప్రస్తావన ఉంటుందని అంతా భావించారు. అయితే, గౌతం గులాటీ 'రవి'గా కనిపించిన పాత్రను పూర్తిగా స్త్రీలోలుడిగా చిత్రించడం, ఓ సీరిస్ సందర్భంగా తన వెంట ఉన్న భార్యను మోసం చేసి అతను అమ్మాయితో గడిపినట్టు చూపించడం రవిశాస్త్రిని దిగ్భ్రాంత పరిచిందట. రవిశాస్త్రి కుటుంబం కూడా ఆయనను ఇలా చూపించారేమిటని మండిపడుతున్నారు. తన పాత్రను చూపించిన తీరును తప్పుబడుతూ ఇప్పటికే రవిశాస్త్రి బీసీసీఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తన పాత్రను తప్పుగా చూపించడంపై ఇప్పటికే మనోజ్ ప్రభాకర్ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని 'అజార్' చిత్రయూనిట్‌ను హెచ్చరించారు. అజారుద్దీన్ మాజీ భార్య సంగీత బిజ్లానీ కూడా సినిమాలో తనను చూపిన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ కక్షే కారణమా! క్రికెట్ ఆడుతున్న సమయంలో అజారుద్దీన్‌కు రవిశాస్త్రికి గొడవలు ఉన్నాయని చెప్తారు. అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు వెలువడిన స్టింగ్ ఆపరేషన్ వెనుక హస్తం ఉన్న క్రికెటర్లలో రవిశాస్త్రి కూడా ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రవిశాస్త్రిపై తన కక్షను తీర్చుకోవడానికి ఈ సినిమాలో ఆయన పాత్రను ఇలా విపరీతంగా చిత్రీకరించేందుకు అజార్ సహకరించి ఉంటాడని వినిపిస్తోంది. -
'అజార్'కు తొలిరోజు భారీ కలెక్షన్!
భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'అజార్' సినిమా తొలి మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 6.3 కోట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా పట్ల రివ్యూలు పెదవి విరిచినా.. ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి టాక్ వస్తోంది. అజారుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మి విలక్షణ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. అజార్ మొదటి భార్య పాత్రలో ప్రాచి దేశాయ్ అభినయం విమర్శకుల ప్రశంసలందుకుంటుండగా.. రెండో భార్య సంగీత బిజిలానీగా నర్గీస్ ఫఖ్రీ, ఇమ్రాన్ మధ్య కెమిస్ట్రీ బాగా పండటం సినిమాకు ప్లస్ అయిందని అంటున్నారు పరిశీలకులు. ఈ మొత్తానికి ఈ సినిమా హిట్ టాక్ తో, మంచి కలెక్షన్లతో ముందుకెళుతున్నదని, కలెక్షన్లకు సంబంధించినంతవరకు శనివారం, ఆదివారం అత్యంత కీలకమని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
పెళ్లికి నో అన్నాడని, వెళ్లిపోయింది
బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రేకప్ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ జంటలు విడిపోగా తాజాగా ఈ లిస్ట్ లో మరో హాట్ కపుల్ జాయిన్ అయ్యింది. చాలా రోజులుగా డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ ఉదయ్ చోప్రా, నర్గీస్ ఫక్రీలు విడిపోయారు. నర్గీస్ పెళ్లి ప్రస్థావనను ఉదయ్ తిరస్కరిచటంతో అలిగిన నర్గీస్ న్యూయార్క్ వెళ్లిపోయింది. గతంలో ఉదయ్ పెళ్లి చేసుకుందామన్న సమయంలో తన కెరీర్ మీద దృష్టి పెట్టిన నర్గీస్ ఫక్రీ పెళ్లికి నో చెప్పింది. ఇప్పుడు అదే ప్రస్తావనను నర్గీస్ తీసుకువచ్చినప్పుడు ఉదయ్ చోప్రా నో చెప్పాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన నర్గీస్ ఫక్రీ అజర్, హౌస్ ఫుల్ 3 సినిమాల ప్రమోషన్ తో పాటు బాంజో షూటింగ్ ను కూడా మధ్యలో వదిలేసి వెళ్లిపోయింది. -
అజహరుద్దీన్‌కు ఒక్కొక్కటిగా అర్థమవుతున్నాయా?
పాత గాయం సినిమా వేరు... జీవితం వేరు... సెలబ్రిటీ జీవితం వేరు... పబ్లిక్‌లోకి వచ్చి, సామాన్యుడిలా నిలబడడం వేరు.... మనకు నోటికొచ్చింది మీడియా మీట్లో చెప్పేసి వెళ్ళిపోవడం వేరు... ప్రత్యేక ఇంటర్వ్యూకు ఒప్పుకొని, అడిగిన ప్రశ్నకల్లా జవాబు చెప్పగలగడం వేరు. క్రికెటర్‌గా పేరు తెచ్చుకొని, భారత క్రికెట్ జట్టుకు సారథిగా కూడా వెలిగిన మహమ్మద్ అజహరుద్దీన్‌కు ఈ విషయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థమవుతున్నాయా? వరుస చూస్తుంటే, అలాగే అనిపిస్తోంది. అజహరుద్దీన్ జీవితంపై తాజాగా హిందీలో ‘అజహర్’ అనే సినిమా వస్తోంది. ఇమ్రాన్ హష్మీ ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర ప్రచారం కోసం అజహర్ ఇప్పుడు వరుసపెట్టి బోలెడన్ని ప్రెస్మీట్లలో మాట్లాడుతున్నారు. అడిగినవాడికి లేదనకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే అలాంటి ఒక ఇంటర్వ్యూ ఆయనకు కొరకరాని కొయ్యగా మారింది. అజహర్ క్రికెట్ ఆడుతున్న సందర్భంలో తలెత్తిన మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం గురించి సదరు ఇంటర్వ్యూలో లోతైన ప్రశ్నలు వేశారట! మాల్కమ్ మార్షల్, కోట్నీ వాల్ష్ లాంటి ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొన్న అజహర్ ఈ వాడి వేడి ప్రశ్నల బంతులకు మాత్రం చేతులెత్తేశారు. ఆ ఇంటర్వ్యూ నుంచి వాకౌట్ చేశారు. ఇంటర్వ్యూ చేస్తున్నవాళ్ళు పదే పదే అభ్యర్థించినా మళ్ళీ వచ్చి కూర్చోలేదు, ఇంటర్వ్యూ కొనసాగించలేదు. విచిత్రం ఏమిటంటే బౌన్సర్ల లాంటి ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే అనుమానంతో మరో న్యూస్ ఛానల్ నిర్వహించే ఒక పెద్ద టీవీ షోకు కూడా మన హైదరాబాదీ క్రికెటర్ నో చెప్పేశారట. ‘జవాబివ్వడానికి తడుముకోవాల్సి వచ్చే ప్రశ్నలు ఎవరైనా అడగడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే, ఆ టీవీ షోకైనా, ఈ ఇంటర్వ్యూకైనా ఆయన దూరంగానే ఉండిపోయారు’ అని ఆంతరంగిక వర్గాలు చెప్పాయి. ఎంతైనా ఇంటర్వ్యూలో సంధించే లోతైన ప్రశ్నల్ని తట్టుకోవడం మైదానంలో క్రికెట్ ఆడినంత సులభం కాదని అజహరుద్దీన్ తాజాగా అనుభవంలోకి వచ్చినట్లుంది! -
వివాదంలో అజర్ సినిమా
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అజర్ సినిమా వివాదాస్పదమవుతోంది. ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్‌గా సేవలందించిన అజర్ జీవితంలో సినిమాను తలపించే ఎన్నో మలుపులున్నాయి. భారీ విజయాలు, వివాదాలు, ప్రేమ వ్యవహారాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఇలా కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఉండటంతో అజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అజరుద్దీన్ స్క్రీప్ట్‌ను ఓకె చేశాకే ఈ సినిమాను పట్టాలెక్కించినట్టుగా చెపుతున్నారు చిత్రయూనిట్. టోని డిసౌజా దర్శకత్వంలో శోభా కపూర్, ఏక్తా కపూర్లు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అజర్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన సమయంలో మనోజ్ ప్రభాకర్ కీలక సాక్షిగా వ్యవహరించాడు. అయితే అజర్ సినిమాలో మనోజ్ పాత్రను నెగెటివ్‌గా చిత్రీకరించారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమా రిలీజ్‌కు ముందే తనకు స్పెషల్ షో వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మనోజ్ ప్రభాకర్‌తో పాటు మరికొంత మంది క్రీడాకారులు కూడా అజర్ సినిమా స్పెషల్ షో కోసం పట్టు పడుతున్నారు. వీరితో పాటు అజర్ భార్య సంగీత బిజీలాని కూడా తన పాత్రను ఎలా చూపించబోతున్నారో అన్న అనుమానం వ్యక్తం చేసింది. చిత్రయూనిట్ స్పెషల్ షోకు అంగీకరించకపోవటంతో మనోజ్ సహా మిగతావారు చట్ట పరమైన చర్యలకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. -
'ఎక్స్ట్రా ముద్దులా.. ఎక్కువ డబ్బివ్వండి'
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఇమ్రాన్ హష్మి తాజా సినిమా 'అజార్'. ఈ సినిమా ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ-నర్గీస్ ఫక్రీ మధ్య హాట్ హాట్ ముద్దుసీన్లను రెండోసారి తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావించారట. ఈ సినిమాలో అజార్ రెండో భార్య సంగీత బిజ్లానీ పాత్రలో నటిస్తున్న ఈ అమ్మడికి ఇలా రెండోసారి తెరకెక్కించడం చాలా చికాకు తెప్పించిందట. అందుకే ఎక్స్ట్రా లిప్‌లాక్ సీన్లు చేయాలంటే ఎక్కువ పారితోషికం ఇవ్వాలని తాను తేల్చిచెప్పినట్టు నర్గీస్ వెల్లడించింది. 'సినిమాలో ఇన్ని ముద్దు సీన్లు ఉంటాయని నాకు తెలియదు. ఇన్ని సీన్లు ఉండటం నాకు చికాకు తెప్పించింది. ఇందుకు ఎక్కువ చార్జ్ చేయాలనిపించింది. అందులోనూ ఎన్నో రీటేక్‌లు, రీషూట్లు ఉన్నాయి. వీటిని చేయడమంటే మాటలా' అంటూ నర్గీస్ కుండబద్దలు కొట్టింది. ముద్దుసీన్లు, ఘాటైన శృంగార దృశ్యాల్లో నటించాలంటే తనకు చాలా ఇబ్బంది అనిపిస్తుందని ఆమె తెలిపింది. 'రాక్‌స్టార్' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ 36 ఏళ్ల భామ అదే సమయంలో సహ నటుడు ఇమ్రాన్ హష్మిపై ప్రశంసల జల్లు కురిపించింది. అతను చాలా కూల్‌గా ఉంటాడని, ఎంత ఒదిగినా ఒదిగి ఉంటాడని, చాలా ప్రొఫెషనల్ అని చెప్తోంది. -
ఆమె అనుమతి లేకుండానే..
ముంబై : ఒకప్నటి క్రికెట్ దిగ్గజం అజారుద్దీన్ జీవిత చరిత్రను 'అజహర్' పేరుతో బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మే రెండవ వారంలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో బాలీవుడ్ బ్యూటీ, అజార్ మాజీ భార్య సంగీతా బిజ్లానీ పాత్ర చిత్రీకరణ వివాదానికి దారి తీసేలా ఉంది. ఈ సినిమాలో అజహర్ మొదటి భార్య పాత్రను ప్రాచీ దేశాయ్ పోషిస్తుండగా, రెండవ భార్య సంగీత బిజలానీ పాత్రలో నర్గీస్ ఫక్రి నటిస్తున్నారు. తాజాగా సంగీతా బిజ్లానీ నర్తించిన అలనాటి హిట్ సాంగ్ ను నర్గీస్ ఫక్రిపై చిత్రీకరించారు. ఈ క్రమంలో తొలిసారి సంగీత పాత్రపై ఆమె సన్నిహితులు స్పందించారు. 'ఆ పాట చిత్రీకరించే ముందు సినీ నిర్మాతలు సంగీతా బిజ్లానీ అనుమతి తీసుకోలేదు. సరే, పాట సంగతి వదిలేసినా.. ఆమె పేరును వాడుతున్నందుకు, ఆమె వ్యక్తిగత విషయాలను, వైవాహిక జీవితాన్ని తెరపై చూపే ముందు ఆమె అనుమతి తీసుకోవాలి. నిర్మాతలు చెబుతున్నట్టు.. వారు సంగీతా బిజ్లానీని ముందే కలుసుకున్నారు. ఈ సినిమా విషయంలో నేనేమీ సహకరించలేనని సంగీత అప్పుడే స్పష్టం చేశారు. అంటే దానర్థం తమకు నచ్చిన రీతిలో పాత్ర చిత్రీకరణ జరుపుకోమని కాదు కదా' అంటూ ఆమె సన్నిహితులు మీడియాకు వివరించారు. సంగీతా బిజ్లానీ పాత్రకు నర్గీస్ ఫక్రిని ఎంపిక చేసినందుకు కూడా వారు అసహనం వ్యక్తం చేశారు. నర్గీస్ చూడడానికి సంగీతలా ఉండదు.. కనీసం తనలా మాట్లాడదు కూడా.. కానీ ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేశారన్నారు. ఏదేమైనా తన వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఆ పాత్ర ఉంటే సంగీత న్యాయపరంగా చర్యలు తీసుకుంటారని వారు స్పష్టం చేశారు. -
అడల్ట్ సిన్మాలకు రెడీ కానీ...: హీరోయిన్
అడల్ట్ చిత్రాలు, సెక్స్ కామెడీ సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమే కానీ, బాలీవుడ్లో మాత్రం అలాంటి సినిమాలు చేయబోనని అంటోంది హీరోయిన్ నర్గీస్ ఫక్రీ. ప్రస్తుతం 'హౌస్‌ఫుల్-3' సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇండియాలో అలాంటి సినిమాలు చేయలేనని, అమెరికా లేదా ఇతర విదేశాల్లో అయితే అలాంటి సినిమాలు చేసినా ఎలాంటి అభ్యంతరముండదని చెప్పుకొచ్చింది. అమెరికాకు చెందిన 36 ఏళ్ల మోడల్ అయిన నర్గీస్ కు ప్రస్తుతం బాలీవుడ్లో మంచి ఆఫర్లే వస్తున్నాయి. 'నేను ఇక్కడ అలాంటి (అడల్ట్, సెక్స్ కామెడీ) సినిమాలు చేయబోను. ఆ విషయంలో సెన్స్ హ్యూమర్ ఇండియాలో చాలా భిన్నంగా ఉంటుంది. అదే అమెరికా, జర్మనీ, లండన్‌లో అయితే వాళ్ల సెన్స్ ఆఫ్ హ్యుమర్ వేరే రకంగా ఉంటుంది. అమెరికాలో అయితే నేను తప్పకుండా ఆ సినిమాల్లో నటిస్తా. ఇక్కడ మాత్రం చేయను' అని నర్గీస్ తాజాగా సెలవిచ్చింది. బాలీవుడ్లో ఇప్పుడు అడల్ట్ కామెడీ సినిమాలకు మంచి మార్కెట్టే ఉంది. గ్రాండ్ మస్తీ, క్యా కూల్ హై హమ్, మస్తీజాదే వంటి పెద్దల సినిమాలు బాగానే కాసులు కురిపించాయి. అయితే, ఇప్పటివరకు బాలీవుడ్లో వచ్చిన అడల్ట్ కామెడీ సినిమాలు చూడలేదని నర్గీస్ తెలిపింది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, లిసా హెడెన్ వంటి ప్రముఖ తారాగణంతో సాజిద్-పర్హాద్ ద్వయం 'హౌస్‌ఫుల్-3'ను తెరకెక్కిస్తోంది. ఈ సినిమాతోపాటు అజారుద్దీన్ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న 'అజార్' సినిమాలోనూ నర్గీస్ నటిస్తోంది. -
'ఆ హీరో ఓపిక చూస్తే ఆశ్చర్యమేస్తుంది'
ముంబై: బాలీవుడ్ లో ఈ మధ్య బయోపిక్ సినిమాల సీజన్ నడుస్తోంది. క్రీడానేపథ్యం, జీవితకథల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలపై అక్కడి ప్రేక్షక్షులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ క్రికెట్లో సక్సెస్ ఫుల్ క్రికెటర్ గానే కాక అంతకంటే ఎక్కువ వివాదాస్పద క్రికెటర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అజారుద్దీన్. అజార్ మూవీలో ఇమ్రాన్ హష్మీ క్రికెటర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో ఇమ్రాన్ తో కలిసి నటిస్తున్న ప్రాచీ దేశాయ్ ఆ హీరోపై ప్రశంసలు కురిపిస్తుంది. అతడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ చెబుతోంది. ఏ సీన్లో అయినా సరే డైరెక్టర్ చెప్పినట్టుగా ఇమ్రాన్ నటిస్తాడని, ఎంతో ఓపికగా ఉంటాడంటోంది. నిజంగానే గతంలో ఇమ్రాన్ చేసిన సినిమాలకు, ప్రస్తుత మూవీకి చాలా వ్యత్యాసాలున్నాయని వివరించింది. రీటేక్ లు ఎన్ని చేస్తున్నా ఇమ్రాన్ ఓపికగా ఉంటాడని సీన్ పైనే దృష్టిపెడతాడని ఈ విషయాన్ని అతడి నుంచి తాను నేర్చుకున్నానని చెప్పింది. వీటితో పాటు ఎలాంటి ప్రశ్నలు అడిగినప్పటికీ సహనాన్ని కోల్పోడంటూ పొగిడేసింది. ఇంకా ఎన్నో నేర్చుకునే అవకాశం ఉందంటూ అజార్ మూవీలో నటిస్తున్న ప్రాచీ దేశాయ్ అంటోంది. అజార్ జీవితంలోని క్రికెట్, వివాదాలు, ప్రేమ, పెళ్లి లాంటి అంశాలపై ఉన్న ఎన్నో అనుమానాలపై ఈ సినిమాతో క్లారిటీ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఏక్తాకపూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు టోని డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. లారాదత్తా, హుమా ఖురేషి, నర్గీస్ ఫక్రీ, గౌతమ్ గులాటీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అజార్ మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. -
క్రికెట్ లెజెండ్ ట్రూ స్టోరీ 'అజార్'
బాలీవుడ్ వెండితెర మీద బయోపిక్ సినిమాల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే క్రీడానేపథ్యంతో తెరకెక్కిన బయోపిక్‌లు ఘనవిజయం సాధించగా తాజాగా మరో నిజజీవిత కథ వెండితెర మీద సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఇండియన్ క్రికెట్లో అందరి కంటే సక్సెస్ ఫుల్ క్రికెటర్ గానే కాక అదే స్థాయిలో వివాదాస్పద క్రికెటర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్న అజారుద్దీన్ జీవిత చరిత్రను అజార్ పేరుతో సినిమాగా రూపొందించారు. ఇమ్రాన్ హష్మీ అజార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ విడుదల అయ్యింది. అజర్ జీవితంలోని వివిధ కోణాలను ఈ సినిమాతో అభిమానుల ముందే ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతున్నారు చిత్రయూనిట్. అజార్ జీవితంలోని క్రికెట్, వివాదాలు, ప్రేమ, పెళ్లి లాంటి అంశాలపై ఉన్న ఎన్నో అనుమానాలపై ఈ సినిమాతో క్లారిటీ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ ను కూడా అదే అంశాలతో రూపొందించారు. ఈ సినిమా అజార్ పాత్రలో నటించిన ఇమ్రాన్‌కు స్వయంగా అజారుద్దీన్ క్రికెట్లో శిక్షణ ఇచ్చారు. ఏక్తాకపూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు టోని డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. లారాదత్తా, హుమా ఖురేషి, నర్గీస్ ఫక్రీ, గౌతమ్ గులాటీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అజార్ మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. -
ఇమ్రాన్ ఆత్మకథ: ' ద కిస్ ఆఫ్ లైఫ్'
బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ రచయితగా మారుతున్నాడు.తన జీవిత కథను ద కిస్ ఆఫ్ మై లైఫ్ పేరుతో అభిమానులకు అందించనున్నాడు. అయితే బాలీవుడ్లో హాట్ హీరో ఇమేజ్ ఉన్న ఈ హీరో తన ఆత్మ కథలో మాత్రం జీవితంలోని విషాదాలనే నేపథ్యంగా తీసుకున్నాడట. తెర మీద స్టార్ హీరోగా వెలుగిపోతున్న ఇమ్రాన్ ఒక దశలో తన జీవితంలో ఎంతో బాదపడిన సందర్భాన్ని ఈ ఆత్మకథలో ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇమ్రాన్ హాష్మీని ఎన్నో ఏళ్లుగా వేదిస్తున్న సమస్య తన కొడుకు అయాన్ క్యాన్సర్‌తో బాధపడటం. తొమ్మిదేళ్ల క్రితం పర్వీన్ సహానిని పెళ్లి చేసుకున్నాడు ఇమ్రాన్. తరువాత కొడుకు పుట్టిన ఆనందం ఈ దంపతులకు ఎక్కువ రోజులు మిగల్లేదు. కొడుకుకు క్యాన్సర్ అని తెలియంటంతో తల్లడిల్లి పోయారు. కొడుకు పడుతున్న కష్టాన్ని చూసి ఎంతో వేదనకు గురయ్యారు. అందుకే క్యాన్సర్‌ను జయించిన తన కొడుకు జీవితాన్నే తన ఆత్మకథలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నాడు. ఇంగ్లీష్, హిందీ, మరాఠి భాషల్లో విడుదలవుతున్న ఈ పుస్తకానికి 'ద కిస్ ఆఫ్ లైఫ్ : హూ ఏ సూపర్ హీరో అండ్ మై సన్ డిఫీటెడ్ క్యాన్సర్' అని పేరు పెట్టాడు. ఈ ఏడాది చివరకల్లా ఈ పుస్తకాని అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బ్రయోగ్రఫికల్ ఫిలిం అజార్లో నటిస్తున్నాడు. -
ఆ తర్వాతే 'మసూద్' గురించి తెలిసింది
-
అడిగారు... కానీ చేయనన్నా!
డి.సురేశ్‌బాబు... అగ్ర నిర్మాత డి.రామానాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకుని చిత్ర నిర్మాణంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఆయన సోదరుడు వెంకటేశ్ అగ్ర కథానాయకుల్లో ఒకరు. తనయుడు రానా ఇప్పుడు హీరోగా, విలన్‌గా రాణిస్తున్నారు. అయితే మొదట్లో వెంకటేశ్ తరహాలోనే డి.సురేశ్‌బాబును కూడా నటునిగా చూడాలని ఆయన తండ్రి రామానాయుడు ఆశించారు. కానీ సురేశ్‌బాబు తెర వెనుకే ఉండటానికి నిర్ణయించుకున్నారు. ఇదంతా ఒకప్పటి విషయం. ఆయనకు తాజాగా ఓ బాలీవుడ్ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించడానికి అవకాశం వచ్చింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ హీరోగా ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్ జీవితం ఆధారంగా తీస్తున్న ‘అజహర్’ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం దర్శక-నిర్మాతలు ఆయనను అడిగారట. అందులో నిజానిజాల గురించి అడిగితే... ‘ఆఫర్ వచ్చిన మాట నిజమే. కానీ చేయనన్నా’ అని సురేశ్‌బాబు తెలిపారు. -
పాక్ క్రికెట్లో పంచాయతీ
► ఆమిర్ రాకపై సీనియర్ల ఆగ్రహం ► క్యాంప్‌ను బహిష్కరించిన హఫీజ్, అజహర్ లాహోర్: పేస్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ పునరాగమనం పాకిస్తాన్ క్రికెట్లో చిచ్చు పెట్టింది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న అనంతరం ఆమిర్ ఇటీవలే మళ్లీ పోటీ క్రికెట్ బరిలోకి దిగాడు. అయితే అతని రాకపై ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్, వన్డే జట్టు కెప్టెన్ అజహర్ అలీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంతో వారిద్దరు పాక్ జట్టు జాతీయ శిబిరంకు తాము హాజరు కాలేమంటూ బహిష్కరించారు. న్యూజిలాండ్ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా 26 మంది క్రికెటర్లతో పాక్ బోర్డు నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంప్‌కు ఆమిర్‌ను ఎంపిక చేశారు. సోమవారం ప్రారంభమైన ఈ క్యాంప్‌కు దేశవాళీ క్రికెట్ కారణంగా తొలి మూడు రోజులు హఫీజ్, అజహర్ రాలేదు. గురువారం జట్టుతో చేరాల్సిన వీరిద్దరు డుమ్మా కొట్టినట్లు మేనేజర్ ఆగా అక్బర్ నిర్ధారించారు. అజహర్ అలీ నేరుగా కారణం చెప్పేయగా, హఫీజ్ ఏమీ చెప్పకుండానే తన నిరసన ప్రకటించాడు. ‘ఆమిర్ అక్కడ ఉన్నంత వరకు నేను శిబిరానికి హాజరు కాను. దీనిపై అవసరమైతే పీసీబీతో చర్చిస్తా. హఫీజ్ గురించి నేను మాట్లాడను కానీ బహుశా అతను కూడా ఇదే కారణంతో తప్పుకొని ఉండవచ్చు’ అని అజహర్ స్పష్టం చేశాడు. -
లాయర్‌గా లారాదత్తా?
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అజహర్’. ఇందులో టైటిల్ రోల్‌ను ఇమ్రాన్ హష్మీ చేస్త్తున్నారు. టోనీ డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతా బిజ్లానీ పాత్రను నర్గిస్ ఫక్రి చేస్తున్నారు. కాగా, లాయర్ పాత్ర కోసం ‘లంచ్ బాక్స్’ ఫేం నిమ్రత్ కౌర్‌ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ, ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో ఈ పాత్రకు లారాదత్తాను ఎంపిక చేశారని సమాచారం. -
మత మార్పిడిపై భార్యను వేధించిన భర్త అరెస్టు
ముజాఫర్ నగర్: భార్యను మతం మార్చుకోవాలంటూ వేధిస్తున్న భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం అజార్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అనంతరం అతను ఇస్లాం మతంలోకి మారాడు. ఆ క్రమంలోనే భార్యను కూడా మతం మారమని వేధింపులకు గురిచేయసాగాడు. అతని వేధింపుల్ని భరించలేని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో భార్యను కొట్టడమే కాకుండా, చిత్రహింసలకు గురి చేశాడని ఎస్ఐ ప్రమోద్ పవార్ తెలిపారు. ఈ జంట 2014 జూన్ 15 వ తేదీన పెళ్లి చేసుకున్నారని స్పష్టం చేశారు. అయితే అతను పెళ్లి చేసుకున్నఅనంతరం మత మార్పిడి చేసుకున్నాడన్నారు. దీనికి సంబంధించి సోమవారం అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.