ఆమె అనుమతి లేకుండానే.. | Sangeeta Bijalani not consulted about Azhar | Sakshi
Sakshi News home page

ఆమె అనుమతి లేకుండానే..

Published Mon, Apr 25 2016 6:15 PM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

ఆమె అనుమతి లేకుండానే..

ఆమె అనుమతి లేకుండానే..

ముంబై : ఒకప్నటి క్రికెట్ దిగ్గజం అజారుద్దీన్ జీవిత చరిత్రను 'అజహర్' పేరుతో బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మే రెండవ వారంలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో బాలీవుడ్ బ్యూటీ, అజార్ మాజీ భార్య సంగీతా బిజ్లానీ పాత్ర చిత్రీకరణ వివాదానికి దారి తీసేలా ఉంది.

ఈ సినిమాలో అజహర్ మొదటి భార్య పాత్రను ప్రాచీ దేశాయ్ పోషిస్తుండగా, రెండవ భార్య సంగీత బిజలానీ పాత్రలో నర్గీస్ ఫక్రి నటిస్తున్నారు. తాజాగా సంగీతా బిజ్లానీ నర్తించిన అలనాటి హిట్ సాంగ్ ను నర్గీస్ ఫక్రిపై చిత్రీకరించారు. ఈ క్రమంలో తొలిసారి సంగీత పాత్రపై ఆమె సన్నిహితులు స్పందించారు. 'ఆ పాట చిత్రీకరించే ముందు సినీ నిర్మాతలు సంగీతా బిజ్లానీ అనుమతి తీసుకోలేదు. సరే, పాట సంగతి వదిలేసినా.. ఆమె పేరును వాడుతున్నందుకు, ఆమె వ్యక్తిగత విషయాలను, వైవాహిక జీవితాన్ని తెరపై చూపే ముందు ఆమె అనుమతి తీసుకోవాలి.

నిర్మాతలు చెబుతున్నట్టు.. వారు సంగీతా బిజ్లానీని ముందే కలుసుకున్నారు. ఈ సినిమా విషయంలో నేనేమీ సహకరించలేనని సంగీత అప్పుడే స్పష్టం చేశారు. అంటే దానర్థం తమకు నచ్చిన రీతిలో పాత్ర చిత్రీకరణ జరుపుకోమని కాదు కదా' అంటూ ఆమె సన్నిహితులు మీడియాకు వివరించారు.

సంగీతా బిజ్లానీ పాత్రకు నర్గీస్ ఫక్రిని ఎంపిక చేసినందుకు కూడా వారు అసహనం వ్యక్తం చేశారు. నర్గీస్ చూడడానికి సంగీతలా ఉండదు.. కనీసం తనలా మాట్లాడదు కూడా.. కానీ ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేశారన్నారు. ఏదేమైనా తన వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఆ పాత్ర ఉంటే సంగీత న్యాయపరంగా చర్యలు తీసుకుంటారని వారు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement