Sangeeta Bijalani
-
సల్మాన్‌ఖాన్ బండారం బయటపెట్టిన మాజీ ప్రేయసి
బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. కొన్ని దశాబ్దాల నుంచి హీరోగా చేస్తున్న ఇతడు.. ఇప్పటికీ బ్యాచిలర్‌గానే ఉండిపోయాడు. కానీ ప్రేమ వ్యవహారాలు మాత్రమే ఎక్కువగానే ఉన్నాయి. ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లతో పాటు పలువురు వేరే కథానాయికలతోనూ రిలేషన్లో ఉన్నాడని అన్నారు. ఇప్పుడు అలా సల్మాన్‌తో కొన్నాళ్లు రిలేషన్లో ఉండి విడిపోయిన ఈ నటి.. అతడిపై తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. ఎవరా నటి? సల్మాన్‌పై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసిన నటి పేరు సోమీ అలీ. ఈమె పాకిస్థానీ అమెరికన్. హిందీలో 'ఆందోళన్', 'మాఫియా' తదితర మూవీస్ చేసింది. సల్మాన్‌తో ఓ మూవీలో నటించింది. షూటింగ్ జరుగుతున్న టైంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడినట్లు రూమర్స్ వచ్చాయి. ఏమైందో ఏమో గానీ ఆ సినిమా ఆగిపోయింది. సల్మాన్-సోమీ అలీ కూడా విడిపోయారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో సల్మాన్ గురించి మాట్లాడిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) ఏం చెప్పింది? 'సల్మాన్- సంగీత విడిపోవడానికి కారణం నేను. నిజానికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ సల్మాన్‌కి పెళ్లి ఇష్టం లేదు. దీంతో నన్ను ఉపయోగించుకుని అది ఆగిపోయేలా చేశాడు. వాళ్ల వివాహానికి అంతా సెట్ అయిన తర్వాత నన్ను హెల్ప్ అడిగాడు. ఇద్దరం కలిసి నా అపార్ట్మెంట్లో సంగీత మమ్మల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో వాళ్ల పెళ్లి క్యాన్సిల్ అయింది. సంగీత విషయంలో ఏం చేశాడో సరిగ్గా అలానే నాకూ చేశాడు. కాకపోతే పెద్దయ్యాకు దీన్ని అర్థం చేసుకున్నా' అని నటి సోమీ అలీ చెప్పుకొచ్చింది. అయితే గతంలోనూ ఓ సందర్భంలో సల్మాన్‌పై రెచ్చిపోయిన సోమీ అలీ.. 'ఏదో ఓ రోజు నీ రంగు బయటపడుతుంది. నువ్వు వేధించిన మహిళలు అందరూ బయటకొచ్చి నిజాలు చెప్తారు. అలానే సల్మాన్.. తనతో రిలేషన్లో ఉండే హీరోయిన్లని ఫిజికల్, మెంటల్‌గా చాలా టార్చర్ పెట్టేవాడు' అని చెప్పింది. అయితే వీటిలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!) -
ఆమె అనుమతి లేకుండానే..
ముంబై : ఒకప్నటి క్రికెట్ దిగ్గజం అజారుద్దీన్ జీవిత చరిత్రను 'అజహర్' పేరుతో బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మే రెండవ వారంలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో బాలీవుడ్ బ్యూటీ, అజార్ మాజీ భార్య సంగీతా బిజ్లానీ పాత్ర చిత్రీకరణ వివాదానికి దారి తీసేలా ఉంది. ఈ సినిమాలో అజహర్ మొదటి భార్య పాత్రను ప్రాచీ దేశాయ్ పోషిస్తుండగా, రెండవ భార్య సంగీత బిజలానీ పాత్రలో నర్గీస్ ఫక్రి నటిస్తున్నారు. తాజాగా సంగీతా బిజ్లానీ నర్తించిన అలనాటి హిట్ సాంగ్ ను నర్గీస్ ఫక్రిపై చిత్రీకరించారు. ఈ క్రమంలో తొలిసారి సంగీత పాత్రపై ఆమె సన్నిహితులు స్పందించారు. 'ఆ పాట చిత్రీకరించే ముందు సినీ నిర్మాతలు సంగీతా బిజ్లానీ అనుమతి తీసుకోలేదు. సరే, పాట సంగతి వదిలేసినా.. ఆమె పేరును వాడుతున్నందుకు, ఆమె వ్యక్తిగత విషయాలను, వైవాహిక జీవితాన్ని తెరపై చూపే ముందు ఆమె అనుమతి తీసుకోవాలి. నిర్మాతలు చెబుతున్నట్టు.. వారు సంగీతా బిజ్లానీని ముందే కలుసుకున్నారు. ఈ సినిమా విషయంలో నేనేమీ సహకరించలేనని సంగీత అప్పుడే స్పష్టం చేశారు. అంటే దానర్థం తమకు నచ్చిన రీతిలో పాత్ర చిత్రీకరణ జరుపుకోమని కాదు కదా' అంటూ ఆమె సన్నిహితులు మీడియాకు వివరించారు. సంగీతా బిజ్లానీ పాత్రకు నర్గీస్ ఫక్రిని ఎంపిక చేసినందుకు కూడా వారు అసహనం వ్యక్తం చేశారు. నర్గీస్ చూడడానికి సంగీతలా ఉండదు.. కనీసం తనలా మాట్లాడదు కూడా.. కానీ ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేశారన్నారు. ఏదేమైనా తన వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఆ పాత్ర ఉంటే సంగీత న్యాయపరంగా చర్యలు తీసుకుంటారని వారు స్పష్టం చేశారు.