సల్మాన్‌ఖాన్ బండారం బయటపెట్టిన మాజీ ప్రేయసి | Actress Somy Ali Comments On Salman Khan And Sangeeta Bijlani Issue | Sakshi
Sakshi News home page

Salman Khan Somy Ali: నన్ను వాడుకుని ఆ హీరోయిన్‌ని మోసం చేశాడు!

Published Tue, Oct 3 2023 5:23 PM | Last Updated on Tue, Oct 3 2023 5:29 PM

Actress Somy Ali Comments Salman Khan Sangeeta Bijlani Issue - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. కొన్ని దశాబ్దాల నుంచి హీరోగా చేస్తున్న ఇతడు.. ఇప్పటికీ బ్యాచిలర్‌గానే ఉండిపోయాడు. కానీ ప్రేమ వ్యవహారాలు మాత్రమే ఎక్కువగానే ఉన్నాయి. ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లతో పాటు పలువురు వేరే కథానాయికలతోనూ రిలేషన్‌లో ఉన్నాడని అన్నారు. ఇప్పుడు అలా సల్మాన్‌తో కొన్నాళ్లు రిలేషన్‌లో ఉండి విడిపోయిన ఈ నటి.. అతడిపై తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. 

ఎవరా నటి?
సల్మాన్‌పై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసిన నటి పేరు సోమీ అలీ. ఈమె పాకిస్థానీ అమెరికన్. హిందీలో 'ఆందోళన్', 'మాఫియా' తదితర మూవీస్ చేసింది. సల్మాన్‌తో ఓ మూవీలో నటించింది. షూటింగ్ జరుగుతున్న టైంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడినట్లు రూమర్స్ వచ్చాయి. ఏమైందో ఏమో గానీ ఆ సినిమా ఆగిపోయింది. సల్మాన్-సోమీ అలీ కూడా విడిపోయారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో సల్మాన్ గురించి మాట్లాడిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

ఏం చెప్పింది?
'సల్మాన్- సంగీత విడిపోవడానికి కారణం నేను. నిజానికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ సల్మాన్‌కి పెళ్లి ఇష్టం లేదు. దీంతో నన్ను ఉపయోగించుకుని అది ఆగిపోయేలా చేశాడు. వాళ్ల వివాహానికి అంతా సెట్ అయిన తర్వాత నన్ను హెల్ప్ అడిగాడు. ఇద్దరం కలిసి నా అపార్ట్‌మెంట్‌లో సంగీత మమ్మల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో వాళ్ల పెళ్లి క్యాన్సిల్ అయింది. సంగీత విషయంలో ఏం చేశాడో సరిగ్గా అలానే నాకూ చేశాడు. కాకపోతే పెద్దయ్యాకు దీన‍్ని అర్థం చేసుకున్నా' అని నటి సోమీ అలీ చెప్పుకొచ్చింది. 

అయితే గతంలోనూ ఓ సందర్భంలో సల్మాన్‌పై రెచ్చిపోయిన సోమీ అలీ.. 'ఏదో ఓ రోజు నీ రంగు బయటపడుతుంది. నువ్వు వేధించిన మహిళలు అందరూ బయటకొచ్చి నిజాలు చెప్తారు. అలానే సల్మాన్.. తనతో రిలేషన్‌లో ఉండే హీరోయిన్లని ఫిజికల్, మెంటల్‌గా చాలా టార్చర్ పెట్టేవాడు' అని చెప్పింది. అయితే వీటిలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement