nargis fakri
-
ఆ హీరోతో ఐదేళ్లు డేటింగ్ చేశా; అందుకే చెప్పలేదు: బాలీవుడ్ నటి
ప్రేమలు, బ్రేకప్‌లు బాలీవుడ్లో సర్వసాధారణం. హిందీ సినీ పరిశ్రమలో నటీనటులు లవ్‌లో పడడం, విడిపోవడం ఎప్పుడూ ఎలా జరుగుతుందో చెప్పడం కష్టం. కాగా నటి నర్గీస్ ఫఖ్రీ (41) గతంలో నటుడు ఉదయ్ చోప్రాతో ఐదేళ్లు ప్రేమలో ఉన్న విషయాన్ని తాజాగా కన్ఫర్మ్ చేసింది. ఇటీవల నర్గీస్ ఎన్డీటీవీకి ఇంటర్వూ ఇచ్చింది. అందులో.. ‘ఉదయ్ చోప్రాతో ఐదేళ్లు డేటింగ్లో ఉన్నాను. ఇండియాలో నేను కలిసిన వ్యక్తుల్లో అందరికి అతను ఎంతో మంచివాడు’ అని తెలిపింది. మీ రిలేషన్షిప్ గురించి ఎందుకు స్పందించలేదనే ప్రశ్నకు బదులుగా.. ‘సోషల్ మీడియా, ఇంటర్నెట్లో వచ్చే ఫేక్ న్యూస్‌ల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీని వల్ల మా అనుబంధం గురించి బయట ప్రపంచానికి వెల్లడించవద్దని నాకు చాలా మంది చెప్పారు. అందుకే బయటకి తెలియనివ్వలేదు’ అని పేర్కొంది. రిలేషన్షిప్లో ఉన్న సమయంలో మాత్రం వారిద్దరూ కేవలం స్నేహితులు అని మాత్రమే చెప్పుకునేవారు. కానీ ఒకసారి మాత్రం ఏకంగా ఉదయ్ చోప్రా, నర్గీస్ సహాజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుబోతున్నారని ప్రచారం జరిగింది. 2016లో వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ బీటౌన్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాగా, రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘రాక్‌స్టార్’ మూవీతో బాలీవుడ్‌కి పరిచయమైంది నర్గీస్. అనంతరం ‘మై తేరా హీరో’, ‘మద్రాస్ కేఫ్’, ‘హౌస్‌ఫుల్ 3’, ‘డిష్యూం మరియు బాంజో’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. ఉదయ్ చోప్రా ‘ధూమ్’ సిరీస్‌తో పాపులారిటీ సాధించాడు. -
పెళ్లికి నో అన్నాడని, వెళ్లిపోయింది
బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రేకప్ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ జంటలు విడిపోగా తాజాగా ఈ లిస్ట్ లో మరో హాట్ కపుల్ జాయిన్ అయ్యింది. చాలా రోజులుగా డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ ఉదయ్ చోప్రా, నర్గీస్ ఫక్రీలు విడిపోయారు. నర్గీస్ పెళ్లి ప్రస్థావనను ఉదయ్ తిరస్కరిచటంతో అలిగిన నర్గీస్ న్యూయార్క్ వెళ్లిపోయింది. గతంలో ఉదయ్ పెళ్లి చేసుకుందామన్న సమయంలో తన కెరీర్ మీద దృష్టి పెట్టిన నర్గీస్ ఫక్రీ పెళ్లికి నో చెప్పింది. ఇప్పుడు అదే ప్రస్తావనను నర్గీస్ తీసుకువచ్చినప్పుడు ఉదయ్ చోప్రా నో చెప్పాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన నర్గీస్ ఫక్రీ అజర్, హౌస్ ఫుల్ 3 సినిమాల ప్రమోషన్ తో పాటు బాంజో షూటింగ్ ను కూడా మధ్యలో వదిలేసి వెళ్లిపోయింది. -
ఆమె అనుమతి లేకుండానే..
ముంబై : ఒకప్నటి క్రికెట్ దిగ్గజం అజారుద్దీన్ జీవిత చరిత్రను 'అజహర్' పేరుతో బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మే రెండవ వారంలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో బాలీవుడ్ బ్యూటీ, అజార్ మాజీ భార్య సంగీతా బిజ్లానీ పాత్ర చిత్రీకరణ వివాదానికి దారి తీసేలా ఉంది. ఈ సినిమాలో అజహర్ మొదటి భార్య పాత్రను ప్రాచీ దేశాయ్ పోషిస్తుండగా, రెండవ భార్య సంగీత బిజలానీ పాత్రలో నర్గీస్ ఫక్రి నటిస్తున్నారు. తాజాగా సంగీతా బిజ్లానీ నర్తించిన అలనాటి హిట్ సాంగ్ ను నర్గీస్ ఫక్రిపై చిత్రీకరించారు. ఈ క్రమంలో తొలిసారి సంగీత పాత్రపై ఆమె సన్నిహితులు స్పందించారు. 'ఆ పాట చిత్రీకరించే ముందు సినీ నిర్మాతలు సంగీతా బిజ్లానీ అనుమతి తీసుకోలేదు. సరే, పాట సంగతి వదిలేసినా.. ఆమె పేరును వాడుతున్నందుకు, ఆమె వ్యక్తిగత విషయాలను, వైవాహిక జీవితాన్ని తెరపై చూపే ముందు ఆమె అనుమతి తీసుకోవాలి. నిర్మాతలు చెబుతున్నట్టు.. వారు సంగీతా బిజ్లానీని ముందే కలుసుకున్నారు. ఈ సినిమా విషయంలో నేనేమీ సహకరించలేనని సంగీత అప్పుడే స్పష్టం చేశారు. అంటే దానర్థం తమకు నచ్చిన రీతిలో పాత్ర చిత్రీకరణ జరుపుకోమని కాదు కదా' అంటూ ఆమె సన్నిహితులు మీడియాకు వివరించారు. సంగీతా బిజ్లానీ పాత్రకు నర్గీస్ ఫక్రిని ఎంపిక చేసినందుకు కూడా వారు అసహనం వ్యక్తం చేశారు. నర్గీస్ చూడడానికి సంగీతలా ఉండదు.. కనీసం తనలా మాట్లాడదు కూడా.. కానీ ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేశారన్నారు. ఏదేమైనా తన వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఆ పాత్ర ఉంటే సంగీత న్యాయపరంగా చర్యలు తీసుకుంటారని వారు స్పష్టం చేశారు. -
పాక్‌లో నర్గీస్ ఫక్రీ యాడ్‌పై విమర్శలు
ఇస్లమాబాద్: పాకిస్థాన్ ప్రముఖ ఉర్దూ వార్తా పత్రిక 'జంగ్' ప్రచురించిన ఓ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చకు తావిచ్చింది. బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ఫోటోతో ప్రధాన పేజీలో ఆదివారం ప్రచురితమైన ఫోన్ యాడ్‌పై ఆన్లైన్ విమర్శకులు దుమ్మెత్తిపోస్తున్నారు. జంగ్ ప్రచురించిన నర్గీస్ ఫోటో అసభ్యంగా ఉందని, ఇలాంటి ఛీప్ యాడ్ వార్తా పత్రికలో కాకుండా మేగజైన్లో అయితే బాగుంటుందని పలువురు విమర్శలు గుప్పించారు. రెడ్ డ్రెస్‌లో సెక్సీగా కన్పిస్తూ చేతిలో ఫోన్‌ను పట్టుకొని పడుకొని ఉన్న నర్గీస్ యాడ్‌ను జంగ్ పత్రిక ఫ్రంట్ పేజీలో ప్రచురించడంపై తొలుత పాకిస్తాన్ ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్ట్ అన్సార్ అబ్బాసీ ఖండించాడు. తరువాత అతనికి జతగా పలువురు నెటీజియన్లు గొంతుకలిపారు. ఇప్పుడు నర్గీస్ ఫక్రీ ఫోటో ప్రచురించారు తరువాత సన్నీ లియోనిని ప్రచురిస్తారేమోనంటూ ఒకరు, చౌక త్రీజీ ఫోన్‌కు ఆమె అందాలకు ఎలాంటి సంబంధం లేదని మరొకరు, జంగ్ పత్రిక యాడ్‌ను ప్రచురించిన తీరు ప్లే బాయ్ మేగజైన్ ముఖచిత్రం కంటే దారుణంగా ఉందరి ఇంకొకరు ట్వీట్ల వర్షం కురిపించారు. My strong protest to top jang group management for this absurd front page ad in today's jang. pic.twitter.com/M5SRc1p3H7 — Ansar Abbasi (@AnsarAAbbasi) December 20, 2015 -
వాడియా.. రాముడు కాదు కృష్ణుడే!!
ప్రీతి జింటాతో డిష్యుం డిష్యుం అన్నట్లున్న నెస్ వాడియా.. ఇప్పటికీ ఆమె తనకు మంచి స్నేహితురాలే అని చెబుతున్నా, ఇద్దరి మధ్య పరిస్థితి ఎలా ఉందో మాత్రం అందరికీ తెలుసు. మాజీ ప్రియుడు తనను కొట్టాడని, వేధిస్తున్నాడని ప్రీతిజింటా ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. అయితే, దాదాపు ఐదేళ్ల పాటు ప్రీతి - వాడియా స్నేహబంధం కొనసాగింది. దానికి ముందు, ఆ తర్వాత, మధ్యలో కూడా నెస్ వాడియా మరికొందరు బాలీవుడ్ భామలతో చెట్టపట్టాలు వేసుకునే తిరిగాడని ముంబై వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. రాక్‌స్టార్ చిత్రంతో ఒక్కసారిగా తారాపథంలోకి దూసుకెళ్లిన నర్గీస్ ఫక్రీ.. నెస్ వాడియాతో రాసుకు పూసుకుని తిరిగి, వార్తల్లో నిలిచింది. రాక్‌స్టార్ సినిమా ప్రీమియర్ షో ముగియగానే, కరణ్ జోహార్ పుట్టినరోజు పార్టీలో నర్గీస్ ఫక్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా హీరో రణ్‌బీర్ కపూర్ రాకపోయినా.. నెస్ వాడియా రూపంలో ఆమెకు ఆ పార్టీలో మంచి కంపెనీయే దొరికింది. వాళ్లిద్దరూ దాదాపు గంట పాటు ఆ పార్టీలో ఒకరినొకరు అతుక్కుపోయి కనిపించారట. ప్రీతిజింటా కూడా ఆ పార్టీలో ఉన్నా, ఫక్రీ స్థాయిలో ఆమె వార్తల్లో నిలవలేకపోయింది. ఒకప్పుడు లారా దత్తాతోను, అంతకంటే ముందు మనీషా కొయిరాలాతో కూడా నెస్ వాడియా కాస్త సన్నిహితంగానే మెలిగాడట. అంతేనా, అమీషా పటేల్ అన్నా కూడా వాడియా చెవి కోసుకునేవాడని బాలీవుడ్ వర్గాల్లో గుప్పుమంది. ఇప్పుడు వాళ్లంతా దూరంగా జరగడంతో.. తాజాగా బిజినెస్ టైకూన్ ఆయేషా థాపర్‌తో వాడియా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడని వినిస్తోంది.