క్రికెట్ లెజెండ్ ట్రూ స్టోరీ 'అజార్' | 'Azhar' trailer released | Sakshi
Sakshi News home page

క్రికెట్ లెజెండ్ ట్రూ స్టోరీ 'అజార్'

Apr 2 2016 1:06 PM | Updated on Sep 3 2017 9:05 PM

క్రికెట్ లెజెండ్ ట్రూ స్టోరీ 'అజార్'

క్రికెట్ లెజెండ్ ట్రూ స్టోరీ 'అజార్'

బాలీవుడ్ వెండితెర మీద బయోపిక్ సినిమాల సీజన్ నడుస్తుంది. ఇప్పటికే క్రీడా నేపథ్యంతో తెరకెక్కిన బయోపిక్ లు ఘనవిజయం సాధించగా తాజాగా మరో నిజజీవితకథ వెండితెర మీద సందడి...

బాలీవుడ్ వెండితెర మీద బయోపిక్ సినిమాల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే క్రీడానేపథ్యంతో తెరకెక్కిన బయోపిక్‌లు ఘనవిజయం సాధించగా తాజాగా మరో నిజజీవిత కథ వెండితెర మీద సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఇండియన్ క్రికెట్‌లో అందరి కంటే సక్సెస్ ఫుల్ క్రికెటర్ గానే కాక అదే స్థాయిలో వివాదాస్పద క్రికెటర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్న అజారుద్దీన్ జీవిత చరిత్రను అజార్ పేరుతో సినిమాగా రూపొందించారు.

ఇమ్రాన్ హష్మీ అజార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ విడుదల అయ్యింది. అజర్ జీవితంలోని వివిధ కోణాలను ఈ సినిమాతో అభిమానుల ముందే ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతున్నారు చిత్రయూనిట్. అజార్ జీవితంలోని క్రికెట్, వివాదాలు, ప్రేమ, పెళ్లి లాంటి అంశాలపై ఉన్న ఎన్నో అనుమానాలపై ఈ సినిమాతో క్లారిటీ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ ను కూడా అదే అంశాలతో రూపొందించారు.

ఈ సినిమా అజార్ పాత్రలో నటించిన ఇమ్రాన్‌కు స్వయంగా అజారుద్దీన్ క్రికెట్‌లో శిక్షణ ఇచ్చారు. ఏక్తాకపూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు టోని డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. లారాదత్తా, హుమా ఖురేషి, నర్గీస్ ఫక్రీ, గౌతమ్ గులాటీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అజార్ మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement