'అజార్‌'కు తొలిరోజు భారీ కలెక్షన్! | Azhar box office collections | Sakshi
Sakshi News home page

'అజార్‌'కు తొలిరోజు భారీ కలెక్షన్!

May 14 2016 2:05 PM | Updated on Sep 4 2017 12:06 AM

'అజార్‌'కు తొలిరోజు భారీ కలెక్షన్!

'అజార్‌'కు తొలిరోజు భారీ కలెక్షన్!

భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'అజార్‌' సినిమా తొలి మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతోంది.

భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'అజార్‌' సినిమా తొలి మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 6.3 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమా పట్ల రివ్యూలు పెదవి విరిచినా.. ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి టాక్ వస్తోంది. అజారుద్దీన్ పాత్రలో ఇమ్రాన్‌ హష్మి విలక్షణ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. అజార్‌ మొదటి భార్య పాత్రలో ప్రాచి దేశాయ్‌ అభినయం విమర్శకుల ప్రశంసలందుకుంటుండగా.. రెండో భార్య సంగీత బిజిలానీగా నర్గీస్ ఫఖ్రీ, ఇమ్రాన్‌ మధ్య కెమిస్ట్రీ బాగా పండటం సినిమాకు ప్లస్ అయిందని అంటున్నారు పరిశీలకులు. ఈ మొత్తానికి ఈ సినిమా హిట్‌ టాక్‌ తో, మంచి కలెక్షన్లతో ముందుకెళుతున్నదని, కలెక్షన్లకు సంబంధించినంతవరకు శనివారం, ఆదివారం అత్యంత కీలకమని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement