ఇమ్రాన్ ఆత్మకథ: ' ద కిస్ ఆఫ్ లైఫ్' | Emraan Hashmi writes a book on his son Ayaan | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్ ఆత్మకథ: ' ద కిస్ ఆఫ్ లైఫ్'

Published Sun, Feb 21 2016 11:22 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

ఇమ్రాన్ ఆత్మకథ: ' ద కిస్ ఆఫ్ లైఫ్'

ఇమ్రాన్ ఆత్మకథ: ' ద కిస్ ఆఫ్ లైఫ్'

బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ రచయితగా మారుతున్నాడు.తన జీవిత కథను ద కిస్ ఆఫ్ మై లైఫ్ పేరుతో అభిమానులకు అందించనున్నాడు. అయితే బాలీవుడ్లో హాట్ హీరో ఇమేజ్ ఉన్న ఈ హీరో తన ఆత్మ కథలో మాత్రం జీవితంలోని విషాదాలనే నేపథ్యంగా తీసుకున్నాడట. తెర మీద స్టార్ హీరోగా వెలుగిపోతున్న ఇమ్రాన్ ఒక దశలో తన జీవితంలో ఎంతో బాదపడిన సందర్భాన్ని ఈ ఆత్మకథలో ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇమ్రాన్ హాష్మీని ఎన్నో ఏళ్లుగా వేదిస్తున్న సమస్య తన కొడుకు అయాన్ క్యాన్సర్తో బాధపడటం. తొమ్మిదేళ్ల క్రితం పర్వీన్ సహానిని పెళ్లి చేసుకున్నాడు ఇమ్రాన్. తరువాత కొడుకు పుట్టిన ఆనందం ఈ దంపతులకు ఎక్కువ రోజులు మిగల్లేదు. కొడుకుకు క్యాన్సర్ అని తెలియంటంతో తల్లడిల్లి పోయారు. కొడుకు పడుతున్న కష్టాన్ని చూసి ఎంతో వేదనకు గురయ్యారు. అందుకే క్యాన్సర్ను జయించిన తన కొడుకు జీవితాన్నే తన ఆత్మకథలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నాడు.

ఇంగ్లీష్, హిందీ, మరాఠి భాషల్లో విడుదలవుతున్న ఈ పుస్తకానికి 'ద కిస్ ఆఫ్ లైఫ్ : హూ ఏ సూపర్ హీరో అండ్ మై సన్ డిఫీటెడ్ క్యాన్సర్' అని పేరు పెట్టాడు. ఈ ఏడాది చివరకల్లా ఈ పుస్తకాని అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బ్రయోగ్రఫికల్ ఫిలిం అజార్లో నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement