'ఆ హీరో ఓపిక చూస్తే ఆశ్చర్యమేస్తుంది' | Emraan Hashmi never loses his patience, says Prachi Desai | Sakshi
Sakshi News home page

'ఆ హీరో ఓపిక చూస్తే ఆశ్చర్యమేస్తుంది'

Published Sat, Apr 23 2016 6:37 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

'ఆ హీరో ఓపిక చూస్తే ఆశ్చర్యమేస్తుంది'

'ఆ హీరో ఓపిక చూస్తే ఆశ్చర్యమేస్తుంది'

ముంబై: బాలీవుడ్ లో ఈ మధ్య బయోపిక్ సినిమాల సీజన్ నడుస్తోంది. క్రీడానేపథ్యం, జీవితకథల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలపై అక్కడి ప్రేక్షక్షులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ క్రికెట్‌లో సక్సెస్ ఫుల్ క్రికెటర్ గానే కాక అంతకంటే ఎక్కువ వివాదాస్పద క్రికెటర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అజారుద్దీన్. అజార్ మూవీలో ఇమ్రాన్ హష్మీ క్రికెటర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో ఇమ్రాన్ తో కలిసి నటిస్తున్న ప్రాచీ దేశాయ్ ఆ హీరోపై ప్రశంసలు కురిపిస్తుంది. అతడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ చెబుతోంది. ఏ సీన్లో అయినా సరే డైరెక్టర్ చెప్పినట్టుగా ఇమ్రాన్ నటిస్తాడని, ఎంతో ఓపికగా ఉంటాడంటోంది. నిజంగానే గతంలో ఇమ్రాన్ చేసిన సినిమాలకు, ప్రస్తుత మూవీకి చాలా వ్యత్యాసాలున్నాయని వివరించింది.

రీటేక్ లు ఎన్ని చేస్తున్నా ఇమ్రాన్ ఓపికగా ఉంటాడని సీన్ పైనే దృష్టిపెడతాడని ఈ విషయాన్ని అతడి నుంచి తాను నేర్చుకున్నానని చెప్పింది. వీటితో పాటు ఎలాంటి ప్రశ్నలు అడిగినప్పటికీ సహనాన్ని కోల్పోడంటూ పొగిడేసింది. ఇంకా ఎన్నో నేర్చుకునే అవకాశం ఉందంటూ అజార్ మూవీలో నటిస్తున్న ప్రాచీ దేశాయ్ అంటోంది. అజార్ జీవితంలోని క్రికెట్, వివాదాలు, ప్రేమ, పెళ్లి లాంటి అంశాలపై ఉన్న ఎన్నో అనుమానాలపై ఈ సినిమాతో క్లారిటీ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఏక్తాకపూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు టోని డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. లారాదత్తా, హుమా ఖురేషి, నర్గీస్ ఫక్రీ, గౌతమ్ గులాటీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అజార్ మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement